సౌత్ నుంచి నార్త్ వెళ్ళి సక్సెస్ ఫుల్ గా స్థిరపడిన కథానాయికల్లో తాప్సీ ఒకరు. ఆమెకంటే ముందు మన సౌత్ హీరోయిన్లు చాలామంది బాలీవుడ్ లో స్థిరపడేందుకు ప్రయత్నించినా పెద్దగా ఫలితం లేకపోయింది. కానీ తాప్సీ మాత్రం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలతోపాటు కమర్షియల్ సినిమాలు కూడా చేస్తూ బాలీవుడ్ లో సెటిల్ అయిపోయింది. ఏదైనా పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్ ఉంది అనుకుంటే దర్శకులు ఆమెను ఒక ఆప్షన్ గా కన్సిడర్ చేస్తున్నారంటే ఆమె కథానాయికగా ఎంతటి విజయం సాధించిందో అర్ధం చేసుకోవచ్చు.
సెలబ్రిటీ అవ్వడానికి ముందు నా లైఫ్ చాలా బాగుండేది. ఎలాంటి టెన్షన్స్ లేవు. సరదాగా ఢిల్లీ మొత్తం తిరిగేసేదాన్ని. నాకు షాపింగ్ అంటే చాలా ఇష్టం. రోడ్ సైడ్ షాపింగ్, రోడ్ సైడ్ ఫుడ్ తినడం నాకు చాలా ఇష్టం. కానీ.. సెలబ్రిటీ స్టేటస్ వచ్చేశాక ఆ ఇష్టాలన్నీ కష్టాలుగా మారిపోయాయి. ఇప్పుడు కనీసం ఢిల్లీ రోడ్డుపై ధైర్యంగా తిరగలేకపోతున్నాను. అభిమానులు వాళ్ళ ప్రేమను చూపిస్తున్నారని అర్ధమవుతున్నప్పటికీ.. ఆ అభిమానం నాకు తలపోటుగా మారింది. హాలీడేస్ ఎంజాయ్ చేయడం కోసం ఇంటికి కాకుండా ఎక్కడో విదేశాలకు వెళ్లాల్సి వస్తుంది అని పేర్కొంది తాప్సీ.
గ్యాంగ్ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
పహిల్వాన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి