దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు గారి డైరెక్షన్ లో వచ్చిన ‘ఝుమ్మంది నాథం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యింది తాప్సి. ఆ చిత్రం ఫలితం ఎలా ఉన్నా… ఈమెకు మాత్రం వరుస ఆవకాశాలు వచ్చాయి. ‘వస్తాడు నారాజు’ ‘మిస్టెర్ పర్ఫెక్ట్’ ‘వీర’ ‘మొగుడు’ దరువు’ ‘గుండెల్లో గోదారి’ ‘షాడో’ ‘సాహసం’ వంటి క్రేజీ సినిమాల్లో నటించింది. చెప్పాలంటే.. ఇవన్నీ పెద్ద ప్రాజెక్టులే. అయినప్పటికీ ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది.
దీంతో బాలీవుడ్ చెక్కేసి అక్కడ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుంది.వరుస హిట్లు అందుకుని అక్కడ బాగా క్లిక్ అయ్యిందనే చెప్పాలి. తరువాత ‘గంగ’ ‘నీవెవరో’ ‘గేమ్ ఓవర్’ వంటి చిత్రాలతో మరోసారి తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది. ఇదిలా ఉంటే… ఈమె మెడ పై ఓ టాటూ ఉంటుంది. అది ఆమె బాయ్ ఫ్రెండ్ పేరుకి సిగ్నలా అనే డిస్కషన్లు మొన్నటి వరకూ సోషల్ మీడియాలో నడిచాయి.అయితే వాటికి తాజాగా తాప్సి క్లారిటీ ఇచ్చింది.
‘పింక్’ సినిమా టైములో నా మొదటి టాటూని మెడ పై వేయించుకున్నాను. స్వేచ్చగా రెక్కలు విప్పుకొని ఎగురుతున్న పక్షులు ఈ టాటూలో కనిపిస్తాయి.ఓ పక్షి ఎవరి సహకారం లేకుండా తన స్వశక్తితోనే ఎదుగుతుంది అనడానికి ఇది సంకేతం. నా సిద్ధాంతం కూడా అదే.ఇక నా ఒంటి మీద కూడా 2 టాటూలు ఉన్నాయి. త్వరలో నా మెడ పై మూడో టాటూని కూడా వేయించుకోవాలనుకుంటాన్నాను” అంటూ చెప్పుకొచ్చింది తాప్సి.
Most Recommended Video
ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్