Satydev: ‘ఫుల్ బాటిల్’ కాన్సెప్ట్ తో సత్యదేవ్!

  • April 6, 2022 / 03:01 PM IST

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సత్యదేవ్.. తన టాలెంట్ తో వరుస అవకాశాలను అందిపుచ్చుకున్నారు. హీరోగా కూడా సినిమాలు చేస్తున్నారు. గతేడాది ‘తిమ్మరుసు’ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. ఆయన నటించిన ‘గుర్తుందా శీతాకాలం’ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో తమన్నా హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం సత్యదేవ్ చేతుల్లో మూడు, నాలుగు సినిమాలు ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ‘గాడ్ ఫాదర్’ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు సత్యదేవ్.

అలానే హీరోగా కొన్ని సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు నిర్మాతగా మారి సినిమాలు నిర్మించడానికి రెడీ అవుతున్నారు. ఎస్‌డీ కంపెనీ పేరుతో ఓ నిర్మాణ సంస్థను మొదలుపెట్టాడు. ఈ సంస్థ నుంచి ఓ కొత్త సినిమాను ప్రకటించారు. అదే ‘ఫుల్ బాటిల్’. ఈ సినిమాను నిర్మించడంతో పాటు హీరోగా కూడా నటిస్తున్నారు సత్యదేవ్. గతంలో చాలా మంది హీరోలు నిర్మాతలుగా మారి సినిమాలను నిర్మించారు. రామ్ చరణ్, నాని, మంచు విష్ణు ఇలా చాలా మంది నిర్మాతలుగా మారారు.

ఇప్పుడు సత్యదేవ్ లాంటి టాలెంటెడ్ నటుడు నిర్మాతగా మారడం ఆహ్వానించ‌ద‌గిన విషయమే. మరి నిర్మాతగా సత్యదేవ్ ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి. శరన్ కొట్టిశెట్టి ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నారు. ఈరోజు సినిమా టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు. కాకినాడ పోర్టు, ఓ ఆటో.. గుడి.. వీరిమధ్యలో ఓ తాగుబోతు.. ఈ కాన్సెప్ట్ తో సినిమాను తెరకెక్కించనున్నారు. క్రైమ్ కామెడీ జోనర్ లో సాగే సినిమా అని తెలుస్తోంది.

శరన్ కొప్పిశెట్టి గతంలో సత్యదేవ్ తో కలిసి ‘తిమ్మరుసు’ సినిమాను రూపొందించారు. కమర్షియల్ గా ఈ సినిమా మంచి హిట్ అందుకుంది. ఇదివరకు నిఖిల్ హీరోగా ‘కిర్రాక్ పార్టీ’ సినిమా తీశారు. ఇప్పుడు సత్యదేవ్ తో చేయబోయేది మూడో సినిమా.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus