Tamanna: రెండు కోట్ల విలువైన వజ్రాన్ని కానుకగా ఇచ్చిన స్టార్ హీరో సతీమణి?

  • July 7, 2022 / 03:13 PM IST

మిల్క్ బ్యూటీ తమన్న ఈమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు దశాబ్దన్నర కాలం అవుతుంది.ఇలా ఇండస్ట్రీలోకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్న ఇప్పటికీ ఈమె క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. వరుస సినిమా అవకాశాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇకపోతే తాతగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్ 3 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే త్వరలోనే ఈమె గుర్తుందా సీతాకాలం అనే సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు.

ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న తమన్నా వ్యక్తిగత విషయానికి వస్తే ఈమె సినిమాలలో బాగానే ఆస్తులు సంపాదించినట్టు తెలుస్తుంది. ఖరీదైన కార్లు, బంగ్లాలను కొనుగోలు చేశారు. ఈ విధంగా తమన్నా ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుందని చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం తమన్నా దగ్గర ఉన్నటువంటి ఒక వస్తువు గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐదవ వజ్రం తమన్నా దగ్గర ఉండటం గమనార్హం.

సుమారు రెండు కోట్లకు పైగా విలువ చేస్తే ఈ వజ్రాన్ని తమన్నాకు ప్రముఖ హీరో రామ్ చరణ్ సతీమణి కానుకగా ఇచ్చారట. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక తమన్నా ఆస్తుల విషయానికి వస్తే ఈమెకు ముంబైలోని అత్యంత ఖరీదైన జుహూ ప్రాంతంలో రూ. 16.60 కోట్ల విలువచేసే అపార్ట్మెంట్ తో పాటు కోట్లు విలువ చేసే కార్లు ఉన్నాయని తెలుస్తోంది.

ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నారు. ఇదివరకే తమన్నా మెగాస్టార్ తో కలిసి సైరా నరసింహారెడ్డి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus