మిల్కీ బ్యూటీ పరిస్థితి ఏంటి..?

  • February 18, 2021 / 05:25 PM IST

గుర్తుందా శీతాకాలం సినిమా ఇప్పుడు సినీలవర్స్ లో ఆసక్తిని కలిగిస్తోంది. సత్యదేవ్ లాంటి హీరోతో స్టార్ హీరోయిన్ గా ఉన్న మిల్కీ బ్యూటీ తమన్నా చేస్తుండటం అనేది సినిమాపై బజ్ ని క్రియేట్ చేస్తోంది. నాగశేఖర్ తెరకెక్కిస్తున్న ఈసినిమా తర్వాత మిల్కీ బ్యూటీ తమన్నా పరిస్థితి ఏంటి అనేది ప్రశ్నగా మారింది. ఎందుకంటే అగ్రహీరోలతో యాక్ట్ చేస్తూ కెరియర్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగిన తమన్నా ఇప్పుడు సత్యదేవ్ తో యాక్ట్ చేయడం అనేది మిల్కీ బ్యూటీ ఫ్యాన్స్ కి మింగుడు పడటం లేదు.

పైగా ఈ సినిమా తర్వాత తమన్నాకి వేరే ఆఫర్లు కూడా ఏమీ లేవు. తమిళంలో ఒక సినిమా మాత్రమే కమిట్ అయ్యింది. తెలుగులో అయితే ఇప్పటివరకూ ఏదీ లేదు. ఆహా నుంచి వస్తున్న వెబ్ మూవీలో మాత్రమే చేస్తోంది. గుర్తుందా శీతాకాలం సినిమా కన్నడంలో మంచి హిట్ అయిన మాక్ టైల్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతోంది. ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని విషయాలని ఎప్పటికీ మర్చిపోలేరు. అలాంటి సంఘటలు టీనేజ్ లో , కాలేజ్ లో చాలామందికి అనుభవం అవుతాయి. ఒక్కో వయసులో ఒక్కో ప్రేమానుభూతి ఉంటుంది. దాన్ని అందమైన చిత్రంగా మలిచి ప్రేక్షకుల ముందుకు తీసుకుని రాబోతున్నారు.

ఇది కన్నడలో సూపర్ హిట్ అయిన సినిమా. అందుకే సినిమాపై ఎలాంటి అనుమానాలు లేవు. బొమ్మ అద్దిరిపోద్ది కానీ, ఇప్పుడు ఈ సినిమా తర్వాత తమన్నా పరిస్థితి ఎలా ఉంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. సత్యదేవ్ తో పాటుగా తమన్నా, మేఘా ఆకాష్, కావ్యశెట్టి నటిస్తున్నారు. ఈ సినిమా తొలిషెడ్యూల్ ని పూర్తి చేస్కుంది. రీసంట్ గా వచ్చిన తమన్నా సత్యదేవ్ ల పోస్టర్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇక త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తోంది మూవీ టీమ్.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus