తమన్నా నుండి ఈ రేంజ్ బోల్డ్ నెస్ ఊహించి ఉండరు.. ఫోటోలు వైరల్.!

తమన్నా భాటియా… మొదటి నుండి గ్లామర్ పాత్రలే చేస్తూ వచ్చింది కానీ.. మితి మీరిన గ్లామర్ షో, ఇంటిమేట్ సన్నివేశాలు, లిప్ లాక్ సన్నివేశాల్లో నటించింది తక్కువ. కానీ ఇప్పుడు ఆ హద్దులు.. తమన్నా చెరిపేసుకున్నట్టు తెలుస్తుంది. తమన్నా 17 ఏళ్లుగా స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది.అయితే ఇప్పుడు కొత్త భామల ఎంట్రీతో ఆమెకు అవకాశాలు బాగా తగ్గాయి. టాక్ షోలు వంటివి ఆమెకు కలిసి రావడం లేదు. స్పెషల్ సాంగ్స్ చేయడానికి అవకాశాలు వస్తున్నా..

ఆమె డిమాండ్ చేసే పారితోషికానికి దర్శకనిర్మాతలు పారిపోతున్నారు.దీంతో ఎక్కువగా వెబ్ సిరీస్లలో నటించడానికి తమన్నా ఇష్టపడుతుంది. అది కూడా హిందీ వెబ్ సిరీస్లలో.! ఓటీటీ కంటెంట్ అంటేనే గ్లామర్ కు పెద్దపీట వేయాలనే పద్ధతి ఏర్పడింది. ఇందుకోసం భారీగా పారితోషికం చెల్లించి స్టార్ హీరోయిన్లను పట్టుకొస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో తమన్నా కూడా అదే పద్ధతిని ఎంచుకుంది.

ఈమె ‘జీ కార్దా’ అనే బాలీవుడ్ వెబ్ సిరీస్ లో నటించింది. తాజాగా ఆ వెబ్ సిరీస్ కి సంబంధించిన ట్రైలర్ బయటకు వచ్చింది. ఇందులో తమన్నా మునుపెన్నడూ లేని విధంగా బోల్డ్ సీన్లలో నటించి అందరికీ షాకిచ్చింది. ఈ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ లోని కొన్ని స్క్రీన్ షాట్స్ తీసుకుని తెగ షేర్ చేస్తున్నారు కొంతమంది కుర్ర నెటిజన్లు.

దీంతో ఒక్కసారిగా తమన్నా ఇంటర్నెట్ ని షేర్ చేసింది అనే చెప్పాలి. అయితే ఇది జస్ట్ సాంపుల్ మాత్రమేనట. తమన్నా ఇంకో వెబ్ సిరీస్ లో కూడా నటిస్తుందట. అందులో ఇంతకు మించి బోల్డ్ సన్నివేశాలు ఉంటాయని భోగట్టా..

 

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus