నన్ను కూడా హాట్ సీన్స్ లో నటించమని అడిగారు : తమన్నా

  • April 30, 2020 / 06:14 PM IST

ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్ళు పూర్తయినప్పటికీ ఇప్పటికీ ఆమెకు ఏమాత్రం అవకాశాలు తగ్గలేదు. ఇప్పటికీ మిల్కీ అందాలను వడ్డిస్తూనే ఉంది. ఎవరి గురించి చెబుతున్నానో ఈపాటికే మీకు అర్ధమైపోయుంటుంది కదా.. ఎస్ మన తమన్నా. సాధారణంగా కేవలం గ్లామర్ ను నమ్ముకున్న హీరోయిన్లు అంతా చాలా వరకూ షెడ్డుకి వెళ్ళిపోవడం ఖాయం. రకుల్ ప్రీత్ వంటి యంగ్ హీరోయిన్లకు కూడా ఇప్పుడు అవకాశాలు తగ్గిపోయాయి. అయినప్పటికీ తమన్నాకి మాత్రం అవకాశాలు బాగానే వస్తున్నాయి.

గతేడాది వెంకటేష్ తో కలిసి ‘ఎఫ్2’ చిత్రంలో నటించింది. తరువాత ‘సైరా’ చిత్రంలో కూడా కీలక పాత్ర పోషించింది.తరువాత విశాల్ తో ‘యాక్షన్’ సినిమాలో కూడా నటించింది. ఆ చిత్రంలో బికినీ కూడా ధరించి కుర్రకారుని అలరించింది.మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో కూడా స్పెషల్ సాంగ్ చేసి అలరించింది.ఇలా ఏదో ఒక రకంగా ప్రేక్షకులకు టచ్ లోనే ఉంటూ వస్తుంది.ఇప్పటికీ అదే ఫిజిక్ మైంటైన్ చేస్తున్న తమన్నా బెడ్ సీన్స్(శృంగార సన్నివేశాలు) ఎప్పుడూ చెయ్యలేదు.

ఒక్క ‘బాహుబలి1’ లో మాత్రం చిన్న పాటి సీన్ లో నటించింది… అది కూడా మితిమీరి ఉండదు. అయితే కెరీర్ ప్రారంభంలోనే ఇలాంటి మితి మీరిన శృంగార సన్నివేశాలు … లిప్ లాక్ లు చెయ్యకూడదు అని తమన్నా ముందే డిసైడ్ అయ్యిందట. కెరీర్ ప్రారంభంలో కొంతమంది అలాంటి సన్నివేశాల్లో నటించమని కోరారట. కానీ మొహమాటం లేకుండా చెయ్యను, అలాంటి పాత్రలకు నేను దూరంగా ఉంటాను అని చెప్పిందట తమన్నా.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

Most Recommended Video

‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
పోకిరి స్టోరీకి మహేష్ చెప్పిన చేంజెస్ అవే..!
హీరోయిన్స్ గా ఎదిగిన హీరోయిన్స్ కూతుళ్లు వీరే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus