Tamanna: ‘ఎఫ్3’ మూవీ టీం ప్లానింగ్స్ అన్నీ ఒక్క దెబ్బకి మారిపోయాయట..!

‘ఎఫ్2’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత అదే టీంతో సీక్వెల్ గా ‘ఎఫ్3’ ని రూపొందిస్తున్నాడు అనిల్ రావిపూడి. ‘ఎఫ్2’ ను మించి ఇందులో ఎంటర్టైన్మెంట్ ఉంటుందని టీం అంతా ధీమా వ్యక్తం చేస్తుంది. మే 27న ఈ చిత్రం విడుదల కాబోతుంది. షూటింగ్ మొత్తం పూర్తయిపోయిందట. ఒక్క ప్రమోషనల్ సాంగ్ మాత్రం బ్యాలన్స్ ఉందని తెలుస్తుంది. కానీ ఈ పాటని క్యాన్సిల్ చెయ్యాలి అనే షాకింగ్ నిర్ణయానికి చిత్ర బృందం వచ్చినట్టు తాజా సమాచారం.

దీనికి ప్రధాన కారణం తమన్నా అని తెలుస్తుంది. అవును షూటింగ్ టైములో తమన్నా ‘ఎఫ్3’ చిత్ర బృందాన్ని చాలా ఇబ్బంది పెట్టిందట. ఆమె ఈ చిత్రం కోసం కేటాయించిన డేట్లకి షూటింగ్ కు వచ్చేది కాదట. ఈమె కోసం వెయిట్ చేయడం… ప్యాకప్ చెప్పడం అన్నట్టు ఉండేదట పరిస్థితి. పోనీ వచ్చినా టైంకి రాదట, అలాగే ఆమె మూడ్ మారిపోతే వెంటనే షూటింగ్ మధ్యలో వెళ్ళిపోయేదట. ఈ విషయమై చిత్ర బృందంతో తమన్నాకి చాలా పెద్ద గొడవైనట్టు తెలుస్తుంది.

అదృష్టవశాత్తు షూటింగ్ కంప్లీట్ అయిపోయింది కానీ.. లేదంటే తమన్నా వల్ల ‘ఎఫ్3’ టీం ఇంకా ఇబ్బందులుపడేదట. అందుకే దర్శకుడు అనిల్ రావిపూడి ఆ ప్రమోషనల్ సాంగ్ బదులు వేరే పాట ఏదైనా చేస్తే బాగుణ్ణు అనే ఆలోచనలో ఉన్నాడట. గతంలో తమన్నా గురించి ఇలాంటి కామెంట్లు వినిపించేవి కావు. తమన్నా చాలా డెడికేటెడ్ అని సుకుమార్, రాజమౌళి వంటి వారు ప్రశంసించారు. ‘బద్రీనాథ్’ ఆడియో రిలీజ్ వేడుకకి గెస్ట్ గా వచ్చిన సుకుమార్.. ‘

తమన్నా చాలా హార్డ్ వర్కర్ అని.. సెట్లో ఫోన్ కూడా మాట్లాదని ప్రశంసిస్తే, ‘బాహుబలి ది బిగినింగ్’ షూటింగ్ టైములో రాజమౌళి ‘తమన్నా చాలా డెడికేటెడ్ అని.. ఆమె హార్డ్ వర్క్ చూసి ఆశ్చర్యపోయినట్టు’ పొగిడేశారు. కానీ ఇప్పుడెందుకు ఇలా అయిపోయిందో మరి..! ఇక ఈ నెల చివరి నుండీ ‘ఎఫ్3’ ప్రమోషన్ల జోరు పెరగనుంది.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus