Tamanna: నా హద్దులు ఏమిటి అనేది నాకు తెలుసు.. ఫైర్ అయిన తమన్నా!

  • October 14, 2023 / 04:23 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో మిల్క్ బ్యూటీగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటిగా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలు వెబ్ సిరీస్ లతోపాటు టాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.
ఇక ఈ మధ్యకాలంలో తన వ్యక్తిగత కారణాలవల్ల తమన్నా పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఇక తమన్నా వెబ్ సిరీస్ లలో నటిస్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున గ్లామర్ షో కూడా చేస్తున్నారు. ఇలా తమన్నా గ్లామర్ షో చేయడం పట్ల ఇప్పటికే ఎన్నో రకాల విమర్శలు వస్తున్నాయి అయితే తాజాగా ఒక నెటిజన్ ఈమెను ప్రశ్నిస్తూ ఈమధ్య కాలంలో అవకాశాలు లేకపోవడం వల్లే మీరు ఇలా గ్లామర్ షో చేస్తున్నారా అంటూ తమన్నాని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు తమన్నా ఒక్కసారిగా నేటిజన్ పై ఫైర్ అయ్యారు.

నెటిజన్ అడిగిన ప్రశ్నకు (Tamanna) ఈమె స్పందిస్తూ.. తనకు అవకాశాలు లేవని నీకు ఎవరు చెప్పారు ఇప్పటికీ నేను రోజుకు 18 గంటల పాటు కష్టపడుతున్నానని తెలియజేశారు ఇదివరకు నేను ఇంతగా కష్టపడిన సందర్భాలు లేవని ఇప్పుడు నేను కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నానని తమన్నా వెల్లడించారు. అయినా నా హద్దులు ఏంటి అనేది నాకు పూర్తిగా తెలుసు. ఇక నేను ధరించే దుస్తులు ఆయా ప్రాంతాలకు అనుగుణంగా ఉంటాయని ఈమె వెల్లడించారు.

ఇక నేను ఏదైనా ఒక సినిమాకు కమిట్ అయ్యాను అంటే ఆ సినిమాలో తన పాత్ర పూర్తిగా తనకు నచ్చితేనే చేస్తాను కానీ నచ్చకపోతే చేయనని ఒకసారి కమిట్ అయిన తర్వాత 100% ఆ సినిమాకు న్యాయం చేయడానికి నేను ప్రయత్నం చేస్తానని తెలిపారు. ఇంకొకసారి ఇలాంటి తెలివి తక్కువ ప్రశ్నలు వేయొద్దు అంటూ ఈమె నెటిజన్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus