Tamanna: రిలేషన్‌లో ఉంటాం.. పెళ్లి చేసుకోం.. వైరల్ అవుతున్న తమన్నా కామెంట్స్‌

  • September 5, 2023 / 06:02 PM IST

ఇండస్ట్రీలోకి వచ్చి దశాబ్దం దాటుతున్నా.. తను పెట్టుకున్న రూల్స్‌ను అతిక్రమించకుండా ఎంతో జాగ్రత్తగా నటిస్తూ వచ్చింది తమన్నా. అయితే మడికట్టుకుని కూర్చోకుండా తనదైన శైలిలో స్కిన్‌ షో కూడా చేసింది. కానీ ఇటీవల తమన్నాలో చాలా మార్పు వచ్చేసింది. ఎందుకో, ఏమో తెలియదు కానీ ముద్దు సన్నివేశాలు, రొమాంటిక్‌ సీన్స్‌, హాట్‌ సీన్స్‌ చేసేసింది. ఆమె అలా నటించడం ఒకవైపు అయితే.. మరోవైపు నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేస్తోంది. త్వరలో పెళ్లి అంటూ పుకార్లు వస్తున్న నేపథ్యంలో తమన్నా మాటలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

తమన్నా, విజయ్‌ వర్మ కలసి ఇటీవల ‘లస్ట్ స్టోరీస్‌ 2’ వెబ్‌ సిరీస్‌ కూడా చేశారు. ఆ సిరీస్‌ సమయంలోనే ఇద్దరి మధ్య అనుబంధం ఏర్పడింది. అది డేటింగ్‌ వరకు వెళ్లింది. ఈ క్రమంలో ఇద్దరూ మాల్దీవులు కూడా వెళ్లి వచ్చారు. విజయ్ వర్మతో రిలేషన్ గురించి తొలుత చెప్పని తమన్నా.. ఆ తర్వాత అవును అనేసింది. మరి పెళ్లి ఎప్పుడు అని అడిగితే… ఇప్పుడు తనకు ఆ ఉద్దేశం లేదు అని చెప్పి షాక్‌ ఇచ్చింది. అయితే విజయ్‌ తనకు అన్ని విధాలా నాకు రక్షణగా ఉంటాడనే నమ్మకం ఉంది అంటోంది.

డేటింగ్‌లో ఉన్నారు, చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు.. మరి పెళ్లెప్పుడు తమన్నా అంటే… తనకు వివాహ వ్యవస్థ మీద పూర్తి నమ్మకం ఉందని, ఒకప్పుడు వివాహం చేసుకోవాలని కూడా అనుకున్నానని… కానీ ఇప్పుడు ఆలోచనలు వేరు అని చెప్పింది. ప్రస్తుతం పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు అని చెప్పింది. ఇప్పుడు నటించడాన్ని ఎంజాయ్ చేస్తున్నానని, మరిన్ని డిఫరెంట్‌ పాత్రలు చేస్తాను అని చెప్పింది.

దీంతో పెళ్లి ఆలోచన లేకుండా విజయ్‌ వర్మతో తమన్నా అనుబంధం సహజీవనం వరకు మాత్రమే ఉండిపోతుందా అనే చర్చ కూడా మొదలైంది. లేకపోతే కొంతమంది నాయికల్లా కొన్నాళ్లపాటు సహజీవనం చేసి బిడ్డను కని ఆ తర్వాత పెళ్లి చేసుకుంటారేమో అనే కామెంట్లు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఆమె సినిమాల సంగతి చూస్తే… తమిళం, హిందీ, మలయాళంలో ఒక్కో సినిమా చేస్తోంది. తెలుగులో అయితే కొత్త సినిమాలేవీ లేవు.

ఖుషి సినిమా రివ్యూ & రేటింగ్!

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!
బిగ్ బాస్ సీజన్ – 7 ఎలా ఉండబోతోందో తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus