Tanikella Bharani: చిరంజీవి ‘బిగ్ బాస్’ సినిమా గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన తనికెళ్ళ భరణి!

  • May 24, 2023 / 07:11 PM IST

మెగాస్టార్ చిరంజీవికి దర్శకత్వంపై పట్టు ఉన్న సంగతి తెలిసిందే. తన అభిమానులకు అలాగే మాస్ ఆడియన్స్ కు తన సినిమాలో ఎలాంటి అంశాలు ఉంటే నచ్చుతాయో.. ఆయనకు బాగా తెలుసు. అందుకే ఆయన మెగాస్టార్ గా ఇప్పటి స్టార్ హీరోలకు పోటీగా రాణిస్తున్నారు. చిరుతో ఏ డైరెక్టర్ సినిమా చేసినా.. కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. ఆయన తన 40 ఏళ్ళ అనుభవంతో ఏదైనా చెబితే.. అది చాలా విలువైన సలహాగా ఉంటుంది. చిరు సలహాలను కరెక్ట్ గా ఫాలో అయ్యి హిట్లు బ్లాక్ బస్టర్లు అందుకున్న దర్శకులు చాలా మందే ఉన్నారు.

‘వాల్తేరు వీరయ్య’ దర్శకుడు బాబీని కూడా ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే చిరు గతంలో ఓ సినిమాకి దర్శకత్వం కూడా వహించారట. ఈ విషయం ఎక్కువ మందికి తెలిసుండదు. సీనియర్ నటుడు తనికెళ్ళ భరణి ఈ విషయాన్ని రివీల్ చేశారు.తాజాగా చిరంజీవి గురించి తన యూట్యూబ్ లో ఛానల్ లో ఓ వీడియోని రిలీజ్ చేశారు తనికెళ్ళ భరణి. ఇందులో చిరంజీవి గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ.. “చిరంజీవి ఓ మధ్యతరగతి కుటుంబం నుండీ వచ్చి ఎవరి సపోర్ట్ లేకుండా స్వయంకృషితో మెగాస్టార్ అయ్యారు.

అది కొన్ని వందల వేల మందికి ఇన్‌స్పిరేషన్. అలాంటి చిరంజీవి గారిని మా గురువు రాళ్లపల్లి గారు మొదట పరిచయం చేశారు. ‘కుక్కకాటుకి చెప్పు దెబ్బ’ అనే సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు .. అక్కడ నాకు చిరంజీవి గారిని పరిచయం చేశారు. అదే నేను చిరంజీవి గారిని తొలిసారి చూడటం. ఆ తర్వాత ఆయనతో చాలా సినిమాలు చేశాను. అందులో ఒక సినిమా అనుభూతి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అదే ‘బిగ్ బాస్’.

ఈ సినిమా విజయ బాపినీడు దర్శకత్వంలో రూపొందింది. ఇందులో (Tanikella Bharani) నేను ఒక దుర్మార్గమైన పోలీస్ ఆఫీసర్‌ని. హీరోని అరెస్ట్ చేయడానికి వెళ్తాను. ఆయనేమో అయ్యప్ప మాలలో ఉంటాడు. ఈ సీన్ డైరెక్ట్ చేయాల్సినప్పుడు బాపినీడు గారు తన ఫ్రెండ్‌కి ఒంట్లో బాగోలేక వెళ్లిపోవాల్సి వచ్చింది. అయితే చిరంజీవి చాలా బిజీ ఆర్టిస్ట్. ఒక్కరోజు షూటింగ్ ఆగిపోతే.. తర్వాత ఆయన డేట్స్ అడ్జస్ట్ చేయడం చాలా కష్టం. అందుకే ఆ సీన్ ను ఆయనే డైరెక్ట్ చేశారు.

ఇంకా ముఖ్యమైన సన్నివేశాలను కూడా ఆ రోజంతా ఆయనే డైరెక్ట్ చేశారు. హీరోగా ఉంటూ అంత టెక్నాలజీ నేర్చుకోవడం దానిని కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయడం అంటే మాటాలు కాదు’ అంటూ తనికెళ్ల భరణి చెప్పుకొచ్చారు. ‘బిగ్ బాస్’ సినిమా ప్లాపైనా.. ఆ సినిమాలో చిరు అయ్యప్ప మాల ఫైట్ సీన్ ఫ్యాన్స్ కు గూజ్ బంప్స్ తెప్పించే విధంగా ఉంటుంది.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus