చేయకూడని పని చేసిన తాప్సి!

  • September 20, 2016 / 07:43 AM IST

టైటిల్ చూసి కంగారుపడేరు.. ఈ సొట్ట బుగ్గల సుందరి అంత కాని పనేం చేయలేదు. తాప్సి నటించిన ‘పింక్’ సినిమా ఇటీవల విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. వేధింపులకు గురయ్యే అమ్మాయి పాత్రలో తాప్సి నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. విమర్శకులనూ మెప్పించిన ఈ చిత్రం తాకనేతో ప్రత్యేకం అని తాప్సి చెప్పుకొచ్చింది. ఈ సినిమాకి లభిస్తోన్న స్పందన తెలియజేయటానికి ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో తాప్సి ఈ చిత్ర రచన, నిర్మాణంలో భాగస్వామి అయిన బాలీవుడ్ దర్శకుడు సూజిత్ సర్కార్ పాదాలను తాకారు.

తర్వాత తాప్సి మాట్లాడుతూ ‘నేను సిక్కు మతస్థురాలిని. మా మత సంప్రదాయాల ప్రకారం మేము ఎవరి పాదాల్ని తాకరాదు. అయితే సూజిత్ సర్కార్ పై నాకున్న గౌరవం ఇలాగే చెప్పాలనుకున్నాను’ అన్నారు. అదన్నమాట అసలు విషయం. ఇకపోతే బాలీవుడ్ వెళ్లి ఉన్న అవకాశాలను పోగొట్టుకుంటుందని విమర్శలు ఎదుర్కొన్న తాప్సి చష్మే బద్దూర్, బేబీ, పింక్ వంటి సినిమాలతో తన నటన దాహాన్ని తీర్చుకుంటోంది. రానా, తాప్సి జంటగా తెరకెక్కిన ‘ఘాజీ’ విడుదలకు సిద్ధమవుతుండగా ప్రకాష్ రాజ్ దర్శకత్వంలో తాప్సి నటిస్తున్న ‘తడ్క’ సెట్స్ పై ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus