Taapsee: ఆ సినిమాలు అంతరించిపోతాయి.. స్టార్‌ హీరోయిన్‌ షాకింగ్‌ కామెంట్స్‌

సినిమా పరిశ్రమలో ముఖ్యంగా బాలీవుడ్‌లో ఏదైనా విషయమ్మీద రియాక్ట్‌ అయ్యే హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. అందులో మనకు కనెక్ట్‌ అయిన నటి అంటే తాప్సి అనే చెప్పాలి. ఆమె చాలా ఏళ్లుగా సినిమా పరిశ్రమ గురించి తన వాయిస్‌ రెయిజ్‌ చేస్తూ వస్తోంది. తాజాగా మరోసారి సినిమాల గురించి తన కన్సర్న్‌ గురించి మాట్లాడింది. ఆ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. సినిమాలు అంతరించిపోతాయని ఆమె చెప్పడం గమనార్హం.

Taapsee

బాలీవుడ్‌లో ప్రస్తుతం హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు చేస్తున్న హీరోయిన్లు తగ్గిపోతూ వస్తున్నారు. అలా ఉన్న కొంతమందిలో తాప్సి కూడా ఉంది. వాటి గురించి మాట్లాడుతూనే పై వ్యాఖ్యలు చేసింది తాప్సి. ప్రధాన పాత్రల్లో నటించే చిత్రాలకు ప్రేక్షకుల మద్దతు లేకపోవడం వల్ల త్వరలో ఆ తరహా సినిమాలు పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉంది అని చెప్పింది. ఆమె ప్రధాన పాత్రలో అనుభవ్‌ సిన్హా తెరకెక్కించిన చిత్రం ‘అస్సీ’. ఈ నెల 20న థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది.

ఈ సినిమా ప్రచారంలో భాగంగానే ఆమె ఈ విషయాలు మాట్లాడింది. ‘అస్సీ’ లాంటి సినిమాలు ఓటీటీలో వస్తూనే ఉంటాయని ప్రేక్షకులు అనుకుంటారు. కానీ ఓటీటీలు ఇలాంటి సినిమాలు కావాలని అనుకోవు. థియేటర్లో నడుస్తున్న సినిమాలనే తమ ప్లాట్‌ఫామ్‌ల్లో తీసుకోవాలని ఓటీటీలు చూస్తున్నాయి. థియేటర్ల ప్రేక్షకుల్ని ఓటీటీలవైపు తిప్పుకునే పనిలో ఉన్నారు. అందుకే ఇలాంటి సినిమాలను థియేటర్లలో చూడాల్సిన అవసరం ఉంది అని చెప్పింది తాప్సి.

ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసేలా అన్ని రకాల సినిమాలు తెరకెక్కించాలి. అలా కాకుండా మన సినిమా ప్రపంచ సినిమాలతో పోటీ పడాలి అనుకుంటూ ఒకే రకమైన సినిమాలు తీయడం కూడా సరికాదు. అలా చేయకుండా సినిమా వైఫల్యానికి ప్రేక్షకులే కారణమనే హక్కు ఎవరికీ ఉండదు అని చెప్పింది తాప్సి. పరిశ్రమకు చెప్పడమే కాదు.. ప్రేక్షకులకూ ఓ విషయం చెప్పింది. ఇంట్లో కూర్చుని ఓటీటీలలో సినిమా చూసి మంచి సినిమాలకు మద్దతు ఇస్తున్నాం అనుకోవడం కూడా సరికాదు అని చెప్పింది.

రుచి, వాసన పోయాయి.. ఆరోగ్యంపై తొలిసారి ఓపెన్‌ అయిన స్టార్‌ హీరో

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus