Bigg Boss 7 Telugu: ఫ్రెండ్స్ మద్యలో పుల్ల పెట్టిన టేస్టీ తేజ..! లైవ్ లో హౌస్ లో ఏం జరిగిందంటే?

  • September 5, 2023 / 11:50 AM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 మొదటి వారం నామినేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఇక్కడే హౌస్ మేట్స్ ఒక్కొక్కరు యాక్టివిటీ రూమ్ లో వేసిన నరకం సెట్ లోకి వెళ్లి హౌస్ మేట్స్ ఫోటోలని చించి నరకంలో వెలిగించిన చితి మంటల్లో వేయాలి. ఇదంతా కూడా నామినేట్ అయిన ఇద్దరూ కన్ఫెషన్ రూమ్ లో నుంచీ చూస్తుంటారు. ఇక్కడే యాక్టివిటీ రూమ్ లోకి వెళ్లిన శోభా శెట్టి చాలాసేపు ఓవర్ యాక్షన్ చేసింది. డార్క్ రూమ్ లో అక్కడక్కడ లైట్స్ ఉన్నా కూడా చాలా భయపడి పోయింది.

దీంతో బిగ్ బాస్ కావాలనే లేట్ గా స్పందిస్తూ తనని ఆటపట్టించాడు. అలాగే, ఎపిసోడ్ స్టార్టింగ్ లో కూడా మార్నింగ్ 6 గంటలకే డోర్ ముందు కూర్చుని బాగా ఎమోషనల్ అయ్యింది. వీక్ గా ఉండకూడదు, స్ట్రాంగ్ గా ఉండాలని తనకి తాను చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇక మిగతా హౌస్ మేట్స్ విషయంలో కూడా తన ఇన్వాల్మెంట్ బాగానే ఉంది. అయితే, రతిక వేసిన పన్నాగాన్ని మాత్రం బాగా తిప్పికొట్టింది.

రతిక తనకి బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడని ఇద్దరి ఫ్రెండ్స్ మద్యలో గొడవ పెట్టాలని చెప్తే, దాని వల్ల నాకు బెనిఫిట్ ఎందుకొస్తుందని నిలదీసింది. అంతేకాదు, ఈవిషయాన్ని అమర్ దీప్ – ప్రియాంక ఇద్దరికీ వెళ్లి చెప్పేసింది. అలాగే, టేస్టీ తేజ కి కూడా కౌన్సిలింగ్ చేసే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత రతిక తో కాసేపు ప్యాచ్ అప్ చేసుకుంది. అలాగే, తనని నామినేట్ చేస్తే రీజన్ సరిగ్గా లేదని ఇచ్చిపారేసింది.

ఇలా బిగ్ బాస్ హౌస్ లో (Bigg Boss 7 Telugu) సెంటర్ హాఫ్ ఎట్రాక్షన్ అవుతూనే ఓవర్ యాక్షన్ చేస్తోందా అనిపించేలా బిహేవ్ చేస్తోంది శోభాశెట్టి. సీరియల్ లో తన క్యారెక్టర్ ని ఆడియన్స్ కి మరోసారి చూపిస్తున్నట్లుగానే కనిపిస్తోంది. మరోవైపు టేస్టీ తేజ ఇద్దరు కండలవీరులు అయిన గౌతమ్ కృష్ణకి , ప్రిన్స్ యవార్ కి గొడవ పెట్టే ప్రయత్నం చేశాడు. టాస్క్ లో భాగంగా చేస్తున్నా కూడా రియల్ గానే ఇద్దరినీ బాగా నమ్మించాడు. షర్ట్ విప్పేసి గౌతమ్ కృష్ణ ర్యాంప్ వాక్ చేశాడు.

దీన్ని పట్టుకుని ప్రిన్స్ యవార్ ని ఇమిటేట్ చేస్తున్నాడని తనకి చెప్పాడు. అలాగే, గౌతమ్ కి వచ్చి ప్రిన్స్ యవార్ ని నువ్వు ఇమిటేట్ చేశావెందుకని ఫీల్ అవుతున్నాడని చెప్పాడు. దీంతో ఇద్దరి మనసులో ఒక మార్క్ పడింది. వీకెండ్ నాగార్జున వచ్చి క్లారిటీ ఇస్తేనే కానీ ఇద్దరికీ అర్ధం కాని పరిస్థితి వచ్చింది. మొత్తానికి టేస్టీ తేజ నారదుడిలా పుల్లలు బాగానే పెడుతున్నాడు.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus