‘నేను అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాను… త్వరలోనే నేను కూడా చచ్చిపోతాననుకుంట..! ‘ప్రేమ’ సినిమాలో హీరోయిన్ రేవతి చనిపోయినట్లు నేనుకూడా ఏ మందులు పనిచేయక ఓ రోజు చనిపోతానని నా ఫ్రెండ్స్‌తో ఎప్పుడూ చెబుతుంటాను. ఆ సినిమాలో హీరోయిన్ లా నేను కూడా ప్రతీ దానికి.. ఏదో ఓక మెడిసిన్ వేసుకుంటూనే వస్తున్నాను. ఏదో ఒక రోజు ఏ మందు పనిచేయక పోతే.. నేను చనిపోవాల్సిందే. నాకు మైగ్రేన్ తలనొప్పి,జలుబు, జ్వరం, నిద్రలేమి సమస్యలున్నాయి’ అంటూ చెప్పుకొచ్చింది హీరోయిన్.. మరియు పొలిటిషన్ అయిన మాధవీ లత.
మహేష్ బాబు ‘అతిధి’ చిత్రంలో హీరోయిన్ ఫ్రెండ్ గా నటించిన ఈ బ్యూటీ.. ఆ తరువాత తనీష్ ‘నచ్చావులే’ అలాగే నాని ‘స్నేహితుడా’ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. బిజెపి పార్టీ తరుపున గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయింది కూడా..! అయితే ఎప్పుడూ తన సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకి దగ్గరగా ఉండే.. ఈ బ్యూటీ సడెన్ గా ఇలా కామెంట్స్ చేయడంతో… వారు షాక్ తిన్నారు. అనారోగ్య సమస్యలు అందరికీ ఉన్నాయి. తరువాత అవే తగ్గిపోతాయి. ఈ మాత్రం దానికే చనిపోవడమేంటి? మీకు కూడా మంచి రోజులొస్తాయి.. అంటూ కొందరు ఆమెను ఓదారుస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
అల్లు అర్జున్ ఆస్తుల వివరాలు
అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన మీడియం రేంజ్ హీరోల సినిమాలు ఇవే..!