ఆ కమెడియన్ ఎంట్రీ ఇస్తే ‘బిగ్ బాస్4’ అదిరిపోతుందేమో..!

  • June 24, 2020 / 04:28 PM IST

మొన్నటి వరకూ హిందీలో మాత్రమే పాపులర్ అయిన ‘బిగ్ బాస్ 4’…. 2017 నుండీ సౌత్ లో కూడా ప్రారంభమయ్యి మంచి ప్రేక్షకాదరణ పొందింది. ముఖ్యంగా తెలుగులో ఈ షోకు మంచి క్రేజ్ ఏర్పడింది. ఇప్పటికే మొదటి సీజన్ ను ఎన్టీఆర్.. రెండో సీజన్ ను నాని.. మూడో సీజన్ ను నాగార్జున హోస్ట్ చేశారు. మూడు సీజన్లు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇక త్వరలో ‘బిగ్ బాస్4’ కూడా ప్రారంభం కానుంది. ఈసారి కూడా నాగార్జునే హోస్ట్ చేస్తారు అని వార్తలు వస్తున్నాయి.

అయితే ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇదిలా ఉండగా.. సీజన్ 4 లో పాల్గొనే కంటెస్టెంట్ లు వీళ్ళేనంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. ఈ సీజన్లో బిత్తిరి సత్తి కూడా ఓ కంటెస్టెంట్ గా పాల్గొనబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతుంది. నిజానికి ఇతను ‘బిగ్ బాస్ 3’ కే ఎంట్రీ ఇస్తాడని వార్తలు వచ్చాయి. కానీ అప్పుడు ‘తీన్మార్’ సావిత్రి మత్రమే ఎంట్రీ ఇచ్చింది. దాంతో ఈసారి బిత్తిరి సత్తి.. బిగ్ బాస్ హౌస్ కు ఎంట్రీ ఇవ్వడం ఖాయం అని సమాచారం.

ఇతన్ని హౌస్ లోకి పంపిస్తే కచ్చితంగా మంచి టి.ఆర్.పి వస్తుందని ‘బిగ్ బాస్’ నిర్వాహకులు భావిస్తున్నారట. ‘తీన్మార్’ వార్తలను తెలంగాణ యాసలో.. అది కూడా తన దైన శైలిలో.. కామెడీగా చెబుతూ బోలెడు మంది అభిమానులను సంపాదించుకున్నాడు బిత్తిరి సత్తి. ‘విన్నర్’ ‘గౌతమ్ నంద’ ‘సీత’ వంటి చిత్రాల్లో కూడా సత్తి నటించాడు. ‘తుపాకీ రాముడు’ సినిమాలో అయితే ఏకంగా హీరోగా నటించి ఆశ్చర్యపరిచాడు. మరి ‘బిగ్ బాస్4’ లో ఎలా ఎంటర్టైన్ చేస్తాడో చూడాలి.

Most Recommended Video

పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్
మీ అభిమాన తారల, అరుదైన పెళ్లి పత్రికలు
ఐశ్వర్యవంతులను పెళ్లి చేసుకున్న అందమైన హీరోయిన్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus