OG Movie: ఓజీ సినిమాలో పవన్ పాట పాడనున్నారా.. థమన్ క్లారిటీ ఇదే!

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలలో ఓజీ సినిమాపై అత్యంత భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడగా డీవీవీ దానయ్య భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాట పాడుతున్నారని ఒక వార్త నెట్టింట వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వార్త ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ఈ వార్త ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. థమన్ మాట్లాడుతూ ఓజీ మూవీ కథ ప్రకారం పవన్ కళ్యాణ్ తో ఈ సినిమాలో పాడే ఛాన్స్ అయితే ఉందని చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం ఆ అవకాశాలను పరిశీలిస్తున్నామని థమన్ కామెంట్లు చేశారు. థమన్ కామెంట్లు పవన్ ఫ్యాన్స్ లో మరింత జోష్ ను నింపుతున్నాయి. పవన్ థమన్ కాంబినేషన్ హిట్ కాంబినేషన్ కాగా ఓజీ సినిమాలో పాటలు అదిరిపోవాలని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఓజీ సినిమా ఈ ఏడాది దసరా కానుకగా రిలీజ్ కానుందని ప్రచారం జరుగుతుండగా ఈ సినిమా విడుదలకు ముందే కళ్లు చెదిరే లాభాలను అందించడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఓజీ మూవీలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని తెలుస్తోంది. సుజీత్ ఈ సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేస్తుందో చూడాల్సి ఉంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ అయితే వచ్చే అవకాశం ఉంది.

ఓజీ సినిమా (OG Movie) పవన్ అభిమానులకు విందు భోజనంలా ఉండనుందని ఈ సినిమా కోసం పని చేసిన నటులు చెబుతున్నారు. వెంకట్, శ్రియారెడ్డి ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఓజీ సినిమా పాన్ ఇండియా మూవీగా ఇతర భాషల్లో సైతం విడుదల కానుందని సమాచారం అందుతోంది. ఓజీ సినిమా పవన్ కెరీర్ లో మెమరబుల్ మూవీగా నిలుస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus