సాహోలో తన పాత్రపై వస్తున్న వార్తలను ఖండించిన అరుణ్ విజయ్

  • December 11, 2017 / 12:34 PM IST

యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సాహో సినిమాలో సౌత్, నార్త్ సినీ పరిశ్రమల్లోని నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో ఏకకాలంలో తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్, విలన్స్ గా బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్, నీల్ నితిన్ ముకేష్, చుంకే పాండే లు నటిస్తున్నారు. అంతేకాదు తమిళనటుడు అరుణ్ విజయ్, మల్లూవుడ్ సీనియర్ నటుడు”లాల్” కూడా సాహోలో కనిపించబోతున్నారు. ఈ మధ్య అరుణ్ విజయ్ నెగిటివ్ పాత్రలతో బాగా ఫేమస్ అయ్యారు. రామ్ చరణ్ బ్రూస్లీ లోను విలనిజంతో అదరగొట్టారు. అలాగే సాహోలో కూడా నెగిటివ్ పాత్రలో కనిపిస్తారని వార్తలు వచ్చాయి. దీనిపై ఆయన ఈరోజు స్పందించారు. ” సాహోలో నాది మంచి స్వభావం కలిగిన రోల్.

ఇప్పటికే కొన్ని సీన్లు కంప్లీట్ చేసాను. ఇంకొన్ని షెడ్యూల్స్ మిగిలి ఉన్నాయి” అని తెలిపారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను అబుదాబిలో తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్, నీల్ నితిన్ ముఖేష్ లు పాల్గొంటున్న ఈ యాక్షన్ సీన్స్ ను మిషన్ ఇంపాజిబుల్ వంటి అనేక హిట్ సినిమాలకు పనిచేసిన హాలీవుడ్ ఫైట్ మాస్టర్ కెన్నీ బేట్స్ ఆధ్వర్యంలో షూట్ చేస్తున్నారు. జాతీయ స్థాయిలో మంచి పేరున్న బాలీవుడ్ సంగీత త్రయం శంకర్ – ఇషాన్ – లాయ్ లు సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది దీపావళికి థియేటర్లోకి రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus