KGF2 Movie: ఆ విషయంలో నిరాశ చెందుతున్న కేజీఎఫ్2 ఫ్యాన్స్!

కేజీఎఫ్2 మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. తొలిరోజు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీస్థాయిలోనే కలెక్షన్లను సొంతం చేసుకుందని సమాచారం అందుతోంది. కేజీఎఫ్ ఛాప్టర్1 నచ్చిన ప్రేక్షకులకు కేజీఎఫ్ ఛాప్టర్2 కూడా నచ్చేస్తోంది. అయితే కేజీఎఫ్2 మూవీలో ఒక మ్యాజిక్ మాత్రం మిస్సైందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఒక విషయంలో మాత్రం కేజీఎఫ్ అభిమానులు నిరాశ చెందుతున్నారు. కేజీఎఫ్ ఛాప్టర్1 సినిమాలో ఆనంద్ వాసిరాజు పాత్రలో అనంత్ నాగ్ తన నటనతో మెప్పించారు.

Click Here To Watch NOW

సినిమాలో ఆయన పాత్ర పరిమితమే అయినా ఆయన కథ చెప్పే విధానం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే వేర్వేరు కారణాల వల్ల ఆయన కేజీఎఫ్ ఛాప్టర్2 సినిమా నుంచి తప్పుకోవడంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆయన కొడుకుగా ప్రకాష్ రాజ్ ను పరిచయం చేసి కథ చెప్పించారు. అయితే అనంత్ నాగ్ కథ చెప్పిన విధానంతో పోల్చి చూస్తే ప్రకాష్ రాజ్ తేలిపోయారనే చెప్పాలి. అనంత్ నాగ్ సినిమాలో నటించి ఉంటే మాత్రం ఈ సినిమా రేంజ్ మరింత పెరిగి ఉండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వ ప్రతిభకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ప్రశాంత్ నీల్ లో ఇంత ప్రతిభ ఉందా? అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ కేజీఎఫ్2 సినిమా ద్వారా సలార్ పై అంచనాలను పెంచేశారు. భారీ బడ్జెట్ తో సలార్ మూవీ తెరకెక్కనుండగా ప్రభాస్ ను ప్రశాంత్ నీల్ ఏ స్థాయిలో చూపిస్తారో అని అభిమానులు చర్చించుకుంటున్నారు.

సాహో, రాధేశ్యామ్ సినిమాలతో ప్రభాస్ నిరాశపరిచినా సలార్ మూవీతో మాత్రం ప్రశాంత్ నీల్ ప్రభాస్ కు మరో భారీ హిట్ ఇస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో నటించడానికి పలువురు టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపుతున్నారు.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus