తమిళ్ సినిమా ఓకే, ‘ఆచార్య’ సంగతేంటి నిహారిక..?

  • June 21, 2020 / 06:16 PM IST

ఈ లాక్ డౌన్ వల్ల టాలీవుడ్ లో వరుసగా పెళ్లిళ్లు ఫిక్స్ అవుతున్నాయి.హీరో నిఖిల్ ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాడు. నిర్మాత దిల్ రాజు.. రెండో పెళ్లి చేసుకున్నాడు. ఎవ్వరూ ఊహించని విధంగా రానా కూడా పెళ్లికి రెడీ అయిపోయాడు.ఆగష్టులోనే రానా పెళ్లి ఉండబోతుంది.నితిన్ పెళ్లి కూడా ఎప్పుడో ఫిక్స్ అయ్యింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు మెగాడాటర్ నిహారికి కూడా పెళ్ళికి రెడీ అవుతుంది.ఇప్పటికే ఆమె పెళ్లి పనులు మొదలైపోయాయి. గుంటూరుకు చెందిన వెంకట చైతన్య జొన్నలగడ్డతో నిహారిక పెళ్లి చెయ్యడానికి కుటుంబ సభ్యులు నిశ్చయించారు.

ఆగష్టులో ఈమె ఎంగేజ్మెంట్ ఉండబోతుందని తెలుస్తుంది. ఆ వెంటనే పెళ్లికూడా జరుగబోతుందని ప్రచారం నడుస్తుంది. ఇక నిహారికతో తనకు కాబోయే భర్త చైతన్య కలిసివున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు అడపా.. దడపా సినిమాల్లోనూ, వెబ్ సిరీస్ లలోనూ నటిస్తూ వస్తోన్న నిహారిక… పెళ్ళైన తరువాత సినిమాల్లో నటిస్తుందా? అనేది పెద్ద ప్రశ్న. అయితే పెళ్ళైన తరువాత సినిమాల్లో నటించను అని నిహారిక ఎప్పుడో చెప్పుకొచ్చింది. ఇదే విషయాన్ని ఆమె తండ్రి నాగబాబు కూడా చెప్పాడు.

అయితే ఈ మధ్యనే తన పెదనాన్న చిరంజీవి .. ‘ఆచార్య’ సినిమాలో నటించబోతున్నట్టు నిహారిక చెప్పుకొచ్చింది. అయితే పెళ్లైయ్యే లోపు ఓ తమిళ చిత్రం షూటింగ్ ను కూడా ఫినిష్ చెయ్యాలని భావిస్తోందట. ‘ఓ మై కడవులే’ ఫేమ్ అశోక్‌సెల్వన్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి స్వాతి అనే అమ్మాయి డైరెక్టర్ గా పరిచయమవుతుందట. మరి ‘ ‘ఆచార్య’ సినిమా సంగతేంటి? అని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

1

2

3

4

5

6

7

8

9

10


Most Recommended Video

పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్
మీ అభిమాన తారల, అరుదైన పెళ్లి పత్రికలు
ఐశ్వర్యవంతులను పెళ్లి చేసుకున్న అందమైన హీరోయిన్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus