సౌత్ ఇండస్ట్రీలో సినీనటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి తమన్న ఒకరు. తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి తమన్న ఇప్పటికీ వరుస సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం విజయ వర్మ ప్రేమలో ఉన్నటువంటి ఈమె గతంలో కూడా ఒక స్టార్ హీరోతో ప్రేమలో ఉండేదట. ఇలా ఆ హీరోతో ప్రేమలో ఉన్నటువంటి తమన్నకు ఆ హీరో ఏకంగా కోట్లు విలువ చేసే ఫ్లాట్ కానుకగా ఇచ్చారని తెలుస్తోంది.
తమన్నా ఇదివరకు ప్రేమలో ఉన్నటువంటి ఆ హీరో ఎవరు అనే విషయానికి వస్తే ఆయన మరెవరో కాదు ప్రముఖ కోలీవుడ్ నటుడు కార్తీ. కార్తీతో కలిసి తమన్నా పలు సినిమాలలో నటించారు. ముఖ్యంగా ఆవారా సినిమా సమయంలో వీరిద్దరి మధ్య చనువు పెరగడమే కాకుండా ఇద్దరు ప్రేమలో పడ్డారట. దీంతో తమ ప్రేమకు గుర్తుగా చెన్నైలో ఖరీదైన ఫ్లాట్ తమన్నకు కార్తీ గిఫ్టుగా ఇచ్చారని తెలుస్తోంది. ఇక వీరి ప్రేమ విషయం కార్తీ తండ్రికి తెలియడంతో ఈయన వీరిద్దరి పెళ్ళికి నిరాకరించారట అప్పటికే హీరో సూర్య జ్యోతికను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
మరొక కోడలు కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అమ్మాయి కాకూడదని కార్తికి గట్టిగా చెప్పడంతో చేసేదేమీ లేక కార్తీ తమన్నాతో బ్రేకప్ చెప్పుకున్నారని తెలుస్తోంది. ఇలా బ్రేకప్ అయిన తర్వాత 2011వ సంవత్సరంలో తన కుటుంబ సభ్యులు చూసినటువంటి బంధువుల అమ్మాయితో కార్తీ వివాహం జరిగింది. ఇక తమన్నా బ్రేకప్ చెప్పుకోవడంతో కార్తీక్ గిఫ్ట్ గా ఇచ్చినటువంటి ఫ్లాట్ తనకు తిరిగి వెనక్కి ఇచ్చేయాలని భావించగా కార్తీ మాత్రం దానిని తీసుకోవడానికి ఇష్టపడటం లేదు
ఇప్పటికి చెన్నైలో (Tamanna) తమన్నాకు ఈ ఫ్లాట్ అలాగే ఉందని తెలుస్తుంది. ఇలా కొంతకాలం పాటు డిప్రెషన్ లో ఉన్నటువంటి తమన్నా తిరిగి తన కెరియర్ పై ఫోకస్ పెట్టారు. అయితే ప్రస్తుతం నటుడు విజయ్ వర్మ ప్రేమలో ఉన్న సంగతి మనకు తెలిసిందే.
బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!