The Family Star Collections: ఫ్యామిలీ స్టార్.. 4 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

  • April 9, 2024 / 09:09 PM IST

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)   హీరోగా పరశురామ్( బుజ్జి) (Parasuram) దర్శకత్వంలో ‘గీత గోవిందం’ (Geetha Govindam) తర్వాత రూపొందిన చిత్రం ‘ది ఫ్యామిలీ స్టార్’ (The Family Star). మృణాల్ ఠాకూర్  (Mrunal Thakur) హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి దిల్ రాజు (Dil Raju)  నిర్మాత. టీజర్ ట్రైలర్స్ ప్రేక్షకులను అలరించాయి. దీంతో మొదటి నుండి సినిమా పై మంచి బజ్ ఏర్పడింది. కానీ ఏప్రిల్ 5 న రిలీజ్ అయిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది.దీంతో సో సో ఓపెనింగ్స్ మాత్రమే నమోదయ్యాయి.

ఒకసారి 4 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 3.85 cr
సీడెడ్ 0.75 cr
ఉత్తరాంధ్ర 0.84 cr
ఈస్ట్ 0.43 cr
వెస్ట్ 0.36 cr
గుంటూరు 0.44 cr
కృష్ణా 0.39 cr
నెల్లూరు 0.35 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 7.44 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.88 cr
 ఓవర్సీస్ 4.69 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 13.01 cr (షేర్)

‘ఫ్యామిలీ స్టార్’ సినిమాకి రూ.41.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.41.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 4 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.13.01 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా రూ.28.49 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus