KGF2 Movie: బిగ్ బాస్ షోకు కేజీఎఫ్2 మూవీకి ఉన్న లింక్ ఇదే!

2022 సంవత్సరంలోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో ఆర్ఆర్ఆర్ ఒకటి కాగా కేజీఎఫ్2 సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమాలో ఇనాయత్ ఖలీల్ పాత్రను పవర్ ఫుల్ గా చూపించారు. ఇనాయత్ ఖలీల్ పాత్రను పోషించిన వ్యక్తి పేరు బాలకృష్ణ కాగా ఈ నటుడు టాలీవుడ్ లో గుర్తింపును సంపాదించుకున్న ఆదర్శ్ బాలకృష్ణ తండ్రి కావడం గమనార్హం.

Click Here To Watch NOW

ఆదర్శ్ బాలకృష్ణ బిగ్ బాస్ సీజన్1 తెలుగు కంటెస్టెంట్ కావడంతో పాటు పలు తెలుగు సినిమాల ద్వారా పాపులారిటీని అంతకంతకూ పెంచుకున్నారు. ఇనాయత్ ఖలీల్ దుబాయ్ డాన్ పాత్రలో సినిమాలో కనిపించి తన పాత్ర ద్వారా మెప్పించారు. ప్రశాంత్ నీల్ కు బాలకృష్ణ బంధువు అని ఆ విధంగా బాలకృష్ణకు ఛాన్స్ దక్కిందని తెలుస్తోంది. ఇనాయత్ ఖలీల్ రోల్ కేజీఎఫ్ ఛాప్టర్3 లో కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంది.

మరోవైపు కేజీఎఫ్3 సినిమా కూడా ఉండబోతుందంటూ ప్రశాంత్ నీల్ ఈ సినిమాపై అంచనాలను పెంచారు. అయితే కేజీఎఫ్3 నిజంగా ఉంటుందా? లేదా అనే క్లారిటీ రావాలంటే ప్రశాంత్ నీల్ స్పందించే వరకు ఆగాల్సిందే. ప్రశాంత్ నీల్ భవిష్యత్తు ప్రాజెక్టులతో కూడా భారీ విజయాలను సొంతం చేసుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ప్రశాంత్ నీల్ కు కేజీఎఫ్ ఛాప్టర్2 సినిమాతో ఫ్యాన్ బేస్ మరింత పెరిగింది. కేజీఎఫ్2 మూవీలోని సెకండాఫ్ లో ప్రతి సీన్ ట్రైలర్ లా ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

కేజీఎఫ్2 ఫుల్ రన్ లో ఏ స్థాయిలో కలెక్షన్లు సాధిస్తుందో చూడాలి. బాలీవుడ్ లో ఈ సినిమాకు నెగిటివ్ రివ్యూలు వచ్చినా కలెక్షన్లు మాత్రం బాగానే ఉన్నాయి. సౌత్ సినిమాలు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో ఆదరణను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus