బిగ్ బాస్ 4: 12వ వారం లిస్ట్ లో ఉన్న 4గురు ఎవరు..?

  • November 23, 2020 / 11:50 AM IST

బిగ్ బాస్ హౌస్ లో 12వ వారం నామినేషన్స్ అనేవి ఆసక్తికరంగా మారాయి. ఎందుకంటే , ఇప్పటివరకూ గేమ్ ఆడింది ఒక లెక్క. ఇక ముందు ఆడేది ఇంకో లెక్క అన్నట్లుగా అయ్యింది. పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఇప్పుడు టాప్ – 5 పై కన్నేశారు. ఈ నేపథ్యంలో నామినేషన్స్ లో ఉండేది ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది.

ఈసారి హారిక కెప్టెన్ కాబట్టి నామినేషన్స్ నుంచి తప్పించుకుంటుంది. సో మిగిలింది ఆరుగురు మాత్రమే. ఈ ఆరుగురులో ఐదుగురు నామినేషన్స్ లోకి వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. వీరిలో అభిజిత్, అవినాష్, అఖిల్, మోనాల్, అరియానా లు ఉన్నారు. సోహైల్ ఈసారి సేఫ్ అయినట్లుగా చెప్తున్నారు.

అయితే, ఈ ఐదుగురులో కూడా హారిక కెప్టెన్సీ పవర్ ని ఉపయోగించి ఒకర్ని సేఫ్ చేసింది. ఇందులో హారిక ఈసారి అభిజిత్ ని సేఫ్ జోన్ లోకి తీస్కుని వచ్చినట్లుగా టాక్. అందుకే ఈసారి అభిజిత్ నామినేషన్స్ లో లేడు. సోహైల్, హారిక, అభిజిత్ లు సేఫ్ గా నెక్ట్స్ వీక్ గేమ్ ఆడేందుకు సిద్ధం అయిపోయారు.

ఇక అరియానా, అఖిల్, అవినాష్ ఇంకా మోనాల్ ఈ నలుగు మాత్రమే నామినేషన్స్ లో ఉన్నట్లుగా సమాచారం. మరి వీరిలో డేంజర్ జోన్ లో ఎవరు ఉంటారు. ఈవారం ఎవరు ఎలిమినేట్ అయిపోతారు అనేది ఆసక్తికరం.

లాస్ట్ వీక్ ఓటింగ్ ని బట్టీ చూస్తే మోనాల్ కి చాలా తక్కువ ఓటింగ్ వచ్చింది. అయితే, ఈసారి లిస్ట్ లో అఖిల్, అవినాష్ లు కూడా ఉన్నారు కాబట్టి ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయి అనేది ఆసక్తికరంగా మారింది. అదీ మేటర్.

Most Recommended Video

మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా రివ్యూ & రేటింగ్!
అనగనగా ఓ అతిధి సినిమా రివ్యూ & రేటింగ్!
రెండు చేతులా సంపాదిస్తున్న 13 హీరోయిన్లు..వీళ్లది మామూలు తెలివి కాదు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus