నేచురల్ స్టార్ నాని గతేడాది ‘హిట్ 3’ వంటి వయొలెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమాతో సక్సెస్ కొట్టారు. తర్వాత ‘ది పారడైజ్'(The Paradise) అనే సినిమాని మొదలుపెట్టారు. 2026 మార్చి 26న రిలీజ్ అని చెబుతూ.. ఓ టీజర్ ని కూడా వదిలారు. మరోపక్క మార్చి 27న ‘పెద్ది’ కూడా వస్తుందని ప్రకటించారు. దీంతో ‘ది పారడైజ్’ ఆ డేట్ కి రాదేమో అని అంతా భావించినా.. టీమ్ అయితే తగ్గము అన్నట్టు క్లారీటీ ఇచ్చింది.
ఆ తర్వాత ‘పెద్ది’ టీమ్ ఆ సినిమాకి సంబంధించి ఏదైనా అప్డేట్ ఇస్తే.. పక్కనే ‘ది పారడైజ్’ టీమ్ కూడా ఏదొక అప్డేట్ ఇస్తూ వచ్చింది.అయితే కొద్దిరోజుల క్రితం ‘పెద్ది’ వాయిదా వేసినట్టు ప్రకటన వచ్చింది. దీంతో ‘ది పారడైజ్’ కి తిరుగులేదు అని అంతా అనుకున్నారు. కానీ పారడైజ్ రిలీజ్ రోజు అయిన మార్చ్ 26 కి పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ అవుతున్నట్టు ప్రకటన వచ్చింది.
కాబట్టి ‘ది పారడైజ్’ వచ్చే అవకాశాలు లేవు అని అంతా అనుకున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాకి పోటీగా నాని సినిమాని దింపే సాహసం ఏ నిర్మాత చేయరు.కాకపోతే ఓ నెల రోజులు ఆలస్యంగా ‘ది పారడైజ్’ రిలీజ్ అవుతుందేమో అని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే ఏకంగా 4 నెలలు వాయిదా వేయడం సంచలనంగా మారింది. అవును ఆగస్టు 21న ‘ది పారడైజ్’ రిలీజ్ కానుంది. కొద్దిసేపటి క్రితం చిత్ర బృందం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
అయితే ఆ డేట్ కి ఉన్న స్పెషాలిటీ ఏంటి అన్నది ఎంత డీకోడ్ చేసినా అర్దం కాని పరిస్థితి. ఎందుకంటే ఆగస్టు 21 పండుగ రోజు ఏమీ కాదు. పోనీ ఆగస్టు 15 కి వస్తుందంటే మేజర్ అడ్వాంటేజ్ ఉంటుంది. తర్వాతి వారం వల్ల ఉపయోగం ఏంటి? చూస్తుంటే చిత్ర బృందం ఏదో నామమాత్రంగా రిలీజ్ డేట్ ప్రకటించినట్టు ఉంది.