Suresh and Nadhiya: సీనియర్ హీరో సురేష్,నదియా ల మధ్య ఉన్న సంబంధం అదే..!

  • July 24, 2021 / 12:48 PM IST

ఒక సినిమా సూపర్ హిట్ అయ్యింది అంటే ఆ సినిమాలో నటించే వాళ్ళందరికీ మంచి పేరు వస్తుంది. ముఖ్యంగా ఆ సినిమాలో నటించిన హీరో, హీరోయిన్లకు హిట్ పెయిర్ అనే ట్యాగ్ యాడ్ అవుతుంది. ఈ క్రమంలో అదే కాంబినేషన్లో మళ్ళీ సినిమా వస్తే బాగుణ్ణు అని వారి అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా కోరుకుంటారు.అలా వాళ్ళు చేసే ప్రతీ సినిమా హిట్ అయితే ఇక వాళ్ళ మధ్య ఏదో ఉంది అని అంతా ఫిక్స్ అయిపోతారు. దాంతో వారి రిలేషన్ గురించి ఏంటేంటో వార్తలు పుట్టుకొస్తుంటాయి.

ఇప్పట్లో హీరో, హీరోయిన్లు వీటిని పెద్దగా పట్టించుకోవడం లేదు కానీ.. గతంలో అయితే హీరో, హీరోయిన్లు ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకునే వారు. ఇది చాలా సెన్సిటివ్ మేటర్ అని భావించే వాళ్ళు. సరిగ్గా ఇలాగె నదియా, సురేష్ ల విషయంలో కూడా జరిగింది. వీళ్ళిద్దరూ కలిసి నటించిన ఓ త‌మిళ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. దాంతో వ‌రుస‌గా వీరి కాంబినేష‌న్‌లో సినిమాలు వచ్చాయి.అవి కూడా బాగానే ఆడాయి.

కానీ ప్ర‌తి సినిమాలో ఈ జంట కనిపిస్తుండ‌టంతో, వీరి మ‌ధ్య ప్రేమ పుట్టింది, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ఇండ‌స్ట్రీలో ప్ర‌చారం జరిగింది. ఈ విషయం పై వీళ్ళు క్లారిటీ కూడా ఇచ్చారు. మా మధ్య ఎటువంటి చెడు సంబంధాలు లేవు అని సురేష్, నదియా క్లారిటీ ఇచ్చారు.అయినా ఇవి ఆగలేదు. దాంతో నదియా, సురేష్ ల కాంబోకి ఫుల్ స్టాప్ పడింది. ఈ క్రమంలో నదియా 1988లో శిరీష్ గాడ్‌బోలే అనే బిజినెస్‌మ్యాన్‌ను వివాహం చేసుకుని, సినిమాల‌కు గుడ్‌బై చెప్పేసి, అమెరికా వెళ్ళిపోయింది.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus