మంచు విష్ణు.. జగనన్నను ఎందుకు కలిశారంటే?

  • January 29, 2021 / 09:17 PM IST

మంచు వారి ఫ్యామిలీ కేవలం సినిమాలతోనే కాకుండా చాలా వరకు పొలిటికల్ గా కూడా రిలేషన్స్ ను పెంచుకోవడంతో ముందుంటారు. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి వారి కుటుంబం చాలా దగ్గరగా ఉంటుంది. ఎలక్షన్స్ ముందు నుంచి కూడా మోహన్ బాబు వైఎస్సార్ కు సపోర్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెడుతున్న పథకాలపై కూడా వారు పాజిటివ్ గా స్పందిస్తున్నారు.

అయితే ఇటీవల మంచు విష్ణు దంపతులు జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీని పర్సనల్ గా కలుసుకున్నారు. “భోజనానికి జగన్ అన్నా మరియు భారతి అక్కలను కలుసుకున్నాను. విద్య పట్ల ఆయన దృష్టి ఎక్కువగా ఉంది. ప్రజలు అతని యొక్క ప్రశాంతమైన హాస్యాస్పదమైన భాగాన్ని మరింత తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అది త్వరలో ” అంటూ విష్ణు పోస్ట్ చేశాడు. ఇక విష్ణు సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మోసగాళ్ళు సినిమాతో రెడీ అవుతున్న విషయం తెలిసిందే.

భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఆ సినిమాపై విష్ణు నమ్మకాన్ని గట్టిగానే పెట్టుకున్నాడు. ఇక ఆ సినిమా తరువాత శ్రీను వైట్ల దర్శకత్వంలో త్వరలో డి & డి ప్రారంభించనున్నాడు. ఇక మోసగాళ్ళు సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో మార్చ్ లో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
సౌత్ లో సక్సెస్ అయిన టాక్ షోలు.. ఏ తారలు హోస్ట్ చేసినవంటే..!
వరల్డ్ రికార్డ్ కొట్టి.. టాలీవుడ్ స్థాయిని పెంచిన సెలబ్రిటీల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus