Devara: దేవర మేకర్స్ సైలెన్స్ వెనుక అసలు కారణాలు ఇవేనా.. ఏమైందంటే?

ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవర సినిమా ఇప్పటికే 85 శాతం పూర్తి కాగా ఈ సినిమా ఇప్పటికే ఫిక్స్ అయిన రిలీజ్ డేట్ కు రిలీజ్ కావడం సులువు కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే దేవర మేకర్స్ రిలీజ్ డేట్ గురించి క్లారిటీ ఇవ్వలేదు. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో కూడా స్పష్టత లేదు. షూటింగ్ పూర్తయ్యాకే రిలీజ్ డేట్ ను ప్రకటించాలని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

పదేపదే రిలీజ్ డేట్ ను మార్చడం వల్ల సినిమా రిజల్ట్ పై ఎఫెక్ట్ పడే అవకాశం అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. దేవర మేకర్స్ ఈసారి రిలీజ్ విషయంలో ఎలాంటి తప్పు జరగకుండా జాగ్రత్త పడుతున్నారని భోగట్టా. సైఫ్ అలీ ఖాన్ కు ప్రమాదం జరగడం వల్లే ఈ సినిమా రిలీజ్ విషయంలో మార్పులు జరిగాయి. సైఫ్ వచ్చే వరకు ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే ఛాన్స్ లేదు.

దేవర (Devara) రిలీజ్ కు సంబంధించిన అప్ డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా 300 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది. దేవర1 ఈ ఏడాది రిలీజ్ కానుండగా దేవర2 సినిమా ఎప్పుడు తెరకెక్కుతుందో చూడాల్సి ఉంది. జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా కోసం ఎంతో కష్టపడ్డారని ఈ సినిమాలో మరో లుక్ ఉంటుందని తెలుస్తోంది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాకు లాభాల్లో వాటా తీసుకున్నారని సమాచారం అందుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో ప్రశంసలు అందుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ త్వరలో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ ల షూటింగ్ లలో పాల్గొననున్నారు. ఎన్టీఆర్ తనదైన క్రేజ్ తో అందరినీ ఆకట్టుకుంటున్నారు.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus