Mahesh Babu: మహేష్ ను స్టీవెన్స్ కలవడానికి అసలు రీజన్ ఇదేనా?

  • August 17, 2022 / 11:22 AM IST

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన అరవింద సమేత వీర రాఘవ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తారక్ లుక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాలో తారక్ ఫిట్ గా కొత్త లుక్ లో కనిపించడానికి ఫిట్ నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ కారణమనే సంగతి తెలిసిందే. తారక్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని తారక్ లుక్ వెనుక కూడా స్టీవెన్స్ ఉన్నారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టీవెన్స్ కు తారక్ ఫిట్ నెస్ ట్రైనర్ గా గుర్తింపు ఉంది. అయితే స్టీవెన్స్ తాజాగా మహేష్ బాబుతో ఫోటో దిగగా ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో మొదలుకానుంది.

ఈ సినిమాలో మహేష్ లుక్ కొత్తగా ఉండాలని భావించి త్రివిక్రమ్ స్టీవెన్స్ పేరును మహేష్ కు సూచించారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. వైరల్ అవుతున్న ఫోటోలో మహేష్ టీషర్ట్ ధరించి క్యాప్ తో కొత్త లుక్ లో కనిపించారు. మహేష్ బాబుకు జోడీగా ఈ సినిమాలో పూజా హెగ్డే నటించనుండగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు. త్రివిక్రమ్ ఎక్కువ సమయం కేటాయించి ఈ సినిమా స్క్రిప్ట్ ను సిద్ధం చేశారు.

లాయిడ్ స్టీవెన్స్ హీరోలతో కసరత్తులు చేయించి హీరోలను కొత్తగా చూపించడంలో ముందువరసలో ఉంటారు. అతడు, ఖలేజా తర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబోలో సినిమా తెరకెక్కనుండగా మహేష్ త్రివిక్రమ్ ఈ ప్రాజెక్ట్ తో సక్సెస్ అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మహేష్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus