సౌత్ ఇండియాలోని పాపులర్ డైరెక్టర్లలో లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) ఒకరు కాగా ఈ దర్శకుని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాల్లో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి. లియో (LEO) సినిమాపై కొన్ని నెగిటివ్ కామెంట్లు వినిపించినా ఈ సినిమా నచ్చిన వాళ్లు సైతం ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. అయితే రజనీకాంత్ (Rajinikanth) లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుందని తెలిసిందే. అయితే లోకేశ్ కనగరాజ్ వల్ల ఈ సినిమా షూట్ ఆలస్యమవుతోందని తెలుస్తోంది.
సినిమా షూటింగ్ ఆలస్యం కావడం వల్ల తన డేట్స్ వృథా అవుతున్న నేపథ్యంలో లోకేశ్ పై సూపర్ స్టార్ ఫైర్ అయ్యారని తెలుస్తోంది. ఈ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కూలీ అనే టైటిల్ తో తెరకెక్కుతోంది. జూన్ రెండవ వారంలో ఈ సినిమా షూట్ మొదలుకావాల్సి ఉన్నా వేర్వేరు కారణాల వల్ల షూట్ ఆలస్యమవుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
రజనీకాంత్ లోకేశ్ కాంబో మూవీ సన్ పిక్చర్స్ బ్యానర్ లో తెరకెక్కనుంది. లోకేశ్ కనగరాజ్ స్క్రిప్ట్ వర్క్ ఇంకా పూర్తి చేయలేదని అందుకే షూట్ ఆలస్యమైందని సమాచారం అందుతోంది. వైరల్ అవుతున్న వార్తల గురించి లోకేశ్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాల్సి ఉంది. గత సినిమా లియో విషయంలో జరిగిన తప్పులు తర్వాత సినిమా విషయంలో జరగకుండా లోకేశ్ జాగ్రత్త పడుతున్నారు.
జులై నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుందని సమాచారం అందుతోంది. వచ్చే ఏడాది సెకండాఫ్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది. జైలర్ సక్సెస్ తో రజనీకాంత్ మార్కెట్ పెరగగా తర్వాత ప్రాజెక్ట్ లతో రజనీ మార్కెట్ మరింత మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఈ ఏడాది దసరా కానుకగా రజనీ నటించిన వేట్టయాన్ మూవీ రిలీజ్ కానుంది. రజనీ కెరీర్ ప్లాన్స్ బాగున్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.