Salaar: సలార్ మూవీ రీ షూట్ వెనుక అసలు కారణాలు ఇవేనా?

  • September 26, 2023 / 12:30 PM IST

ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సలార్ మూవీ వాయిదా పడటం ఫ్యాన్స్ ను బాధ పెట్టిన సంగతి తెలిసిందే. గ్రాఫిక్స్ పనుల వల్ల ఈ సినిమా షూట్ వాయిదా పడిందని ప్రచారం జరగగా ప్రస్తుతం ఈ సినిమా రీషూట్ జరుగుతోందని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ కు ఇది న్యాయమేనా అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. రెబల్ సినిమా నుంచి ప్రశాంత్ నీల్ ప్రతి సినిమా వాయిదా పడుతుండటం గమనార్హం.

సలార్ మూవీ ఔట్ పుట్ విషయంలో ప్రశాంత్ నీల్ సంతృప్తితో లేరని ఈ రీజన్ వల్లే ప్రశాంత్ నీల్ ఈ మూవీ రిలీజ్ డేట్ ను వాయిదా వేశారని తెలుస్తోంది. ఈ సినిమా థియేటర్లలో విడుదల కావాలంటే వచ్చే ఏడాది సమ్మర్ వరకు ఎదురుచూపులు తప్పవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రశాంత్ నీల్ గత సినిమాల విషయంలో ఇలా జరగలేదని ఈ సినిమా విషయంలో ఎందుకు జరుగుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

సలార్ (Salaar) మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న నేపథ్యంలో సలార్1 వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదలైతే సలార్2 ఎప్పుడు విడుదలవుతుందని ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. సలార్ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు కొత్తగా ఉండనున్నాయని తెలుస్తోంది. సలార్ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు.

సలార్ సినిమా ఫ్రెండ్ షిప్ నేపథ్యంలో తెరకెక్కుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సలార్ సినిమా కొత్త రిలీజ్ డేట్ కు సంబంధించి త్వరలో పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇతర భాషల్లో సైతం సలార్ మూవీ సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సలార్ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడంతో పాటు ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus