విరూపాక్ష హిట్ కావడం వెనుక రీజన్స్ తెలిస్తే షాకవ్వాల్సిందే?

  • April 23, 2023 / 06:02 PM IST

సాయితేజ్ నటించిన విరూపాక్ష మూవీ పాజిటివ్ టాక్ తో థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. ఫస్ట్ వీకెండ్ సమయానికి ఈ సినిమా 70 శాతానికి పైగా కలెక్షన్లను సాధించే అవకాశం ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. విరూపాక్ష సినిమాలో ఆసక్తికర ట్విస్టులు ఉన్నాయనే సంగతి తెలిసిందే. ట్విస్టుల గురించి ఏ మాత్రం తెలుసుకోకుండా ఈ సినిమాను చూస్తే మాత్రం సర్ప్రైజ్ గా ఫీలయ్యే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో ఈ స్థాయిలో ప్రేక్షకులను థ్రిల్ కు గురి చేసిన సినిమా అయితే లేదనే సంగతి తెలిసిందే.

సుకుమార్ స్క్రీన్ ప్లే, కార్తీక్ దండు డైరెక్షన్ ఈ మూవీ స్క్రిప్ట్ లో కీలక పాత్ర పోషించాయి. సుకుమార్ శిష్యులలో ప్రతి ఒక్కరూ వేర్వేరు తరహా సినిమాలతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తూ విజయాలను సొంతం చేసుకుంటూ ఉండటం హాట్ టాపిక్ అవుతోంది. విరూపాక్ష సినిమాలో ప్రతి నటుడు తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. అయితే రెండు వారాల క్రితం భారీ అంచనాలతో విడుదలైన రావణాసుర సినిమా కూడా ఇదే తరహా అంచనాలతో వచ్చినా ఆ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేదు.

ప్రేక్షకులకు ఈ సినిమా ఏ మాత్రం నచ్చలేదు. కథ, కథనం ఆసక్తికరంగా లేకపోవడం వల్ల రావణాసుర సినిమా ఫ్లాప్ కాగా కథ, కథనం అద్భుతంగా ఉండటం విరూపాక్ష సినిమాకు ప్లస్ అయిందనే సంగతి తెలిసిందే. విరూపాక్ష రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సుకుమార్ వల్లే విరూపాక్ష సినిమా ఈ రేంజ్ లో సక్సెస్ అయిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

విరూపాక్ష సక్సెస్ తో సాయితేజ్ కథల ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. విరూపాక్ష సక్సెస్ తో సాయితేజ్ రెమ్యునరేషన్ కూడా భారీగా పెరిగే ఛాన్స్ ఉంది.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus