మరో రెండు నెలల్లో రిలీజ్ కావాల్సిన పుష్ప ది రూల్ ఊహించని విధంగా వాయిదా పడింది. ఈ సినిమా ఏకంగా నాలుగు నెలలు వాయిదా పడటంతో ఈ సినిమా విషయంలో ఏం జరిగిందనే చర్చ మొదలైంది. ఆగష్టు 15 లాంటి మంచి డేట్ ను వదులుకుని పుష్ప2 (Pushpa 2: The Rule) మేకర్స్ డిసెంబర్ పై ఎందుకు ఫోకస్ పెట్టారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. రిలీజ్ డేట్ వాయిదా వల్ల పుష్ప2 మేకర్స్ పై కోట్ల రూపాయల భారం పెరుగుతుంది.
అయితే బన్నీ (Allu Arjun) పై మెగా ఫ్యాన్స్ కోపం వల్లే పుష్ప ది రూల్ వాయిదా పడిందా? అనే చర్చ జరుగుతోంది. బన్నీకి పుష్ప ది రూల్ ఔట్ పుట్ నచ్చలేదని, ఫహద్ ఫాజిల్ (Fahadh Faasil) డేట్ల సమస్య ఎదురైంది, కొంతమంది టెక్నీషియన్స్ తప్పుకోవడం ఈ సినిమాకు కొత్త సమస్యలు తెచ్చిపెట్టిందని, సుకుమార్ (Sukumar) డెడ్ లైన్ ను అందుకోవడం కష్టమని చెప్పారని, స్పెషల్ సాంగ్ ఆలస్యం సినిమా వాయిదాకు కారణమని ఇలా ఒకదానితో మరొకటి సంబంధం లేని కారణాలు ప్రచారంలోకి వస్తున్నాయి.
పుష్ప ది రూల్ బిజినెస్ చాలా కాలం క్రితమే పూర్తైంది. నార్త్ బెల్ట్ లో సైతం పుష్ప ది రూల్ మూవీపై అంచనాలు మామూలుగా లేవు. పుష్ప ది రూల్ వాయిదాకు మేకర్స్ కొన్ని రీజన్లు చెప్పినా ఆ కారణాలు నమ్మే విధంగా లేవని నెటిజన్లు ఫీలవుతున్నారు. బన్నీ విషయంలో మెగా ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉండటం పుష్ప2 వాయిదాపై తీవ్ర ప్రభావం చూపిందని ప్రచారం జరుగుతోంది.
పుష్ప2 వాయిదా వల్ల బన్నీ ఒక్క సినిమాకే ఏకంగా మూడు సంవత్సరాల సమయం కేటాయించినట్టు అవుతుంది. బన్నీపై ట్రోల్స్ అంతకంతకూ పెరుగుతుండటం కూడా పుష్ప2 వాయిదాకు కారణమని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ మాత్రం వివాదాల గురించి నోరు మెదపడం లేదు. తాను ఏం మాట్లాడినా వివాదం మరింత పెద్దదవుతుందని బన్నీ భావిస్తున్నారని తెలుస్తోంది.