తిరువీర్ హీరోగా ‘ ఓ సుకుమారి’ అనే సినిమా రూపొందింది. ఈ వారమే అంటే జూలై 17న ప్రేక్షకుల ముందుకు రానుంది ఆ సినిమా. ఐశ్వర్య రాజేశ్ ఈ సినిమాలో హీరోయిన్. ఈ సినిమాపై బజ్ అయితే లేదు. అసలు ఇదొక సినిమా వస్తుంది అని చాలా మంది ప్రేక్షకులకి తెలీదు అంటే అతిశయోక్తి అనిపించుకోదు. తిరువీర్, ఐశ్వర్య రాజేశ్ పై మాత్రం ఓ సెక్షన్ ఆడియన్స్ కి నమ్మకం ఉంది. వాళ్ళ సినిమాలో మంచి కంటెంట్ ఉంటుంది అని నమ్మే జనాలు ఎక్కువ.
కాబట్టి.. ‘ఓ సుకుమారి’కి పాజిటివ్ మౌత్ టాక్ కనుక వస్తే కనుక పికప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.! ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. పైన టైటిల్ చూసిన తర్వాత అందరికీ ఓ డౌట్ రావాలి. అసలు ఈ ‘ఓ సుకుమారి’ సినిమాకి… ‘ ‘అనగనగా ఒక రాజు'(Anaganaga Oka Raju) సినిమాకి సంబంధం ఏంటి?’ అని..! అక్కడికే వస్తున్నా.. ఈ 2 సినిమాల గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అదేంటంటే.. వాస్తవానికి ‘ఓ సుకుమారి’ సినిమా షూటింగ్ ‘అనగనగా ఒక రాజు’ కంటే ముందుగానే చాలా వరకు పూర్తయ్యిందట.
అయితే ‘ఓ సుకుమారి’ సినిమా షూటింగ్ పలు కారణాల వల్ల ఆలస్యం అయ్యింది. మరోవైపు ఓ సందర్భంలో ‘ఓ సుకుమారి’ కి సంబంధించిన కొంత పోర్షన్ ను తన ఫ్రెండ్, టాలీవుడ్ దర్శకుడు అయినటువంటి అనుదీప్ కేవీకి చూపించాడట దర్శకుడు భరత్ దర్శన్. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ సంక్రాంతికి ‘అనగనగా ఒక రాజు’ సినిమా రిలీజ్ అయ్యింది. అందులో చాలా వరకు ‘ఓ సుకుమారి’ సినిమా కోసం తీసిన సన్నివేశాలు ఉండటం చూసి షాక్ అయ్యాడట దర్శకుడు భరత్ దర్శన్.
ఆ తర్వాత నిర్మాతకి చెప్పి ‘ఓ సుకుమారి’ లో ఆ సన్నివేశాలని మార్చి రాయడం, అటు తర్వాత రీషూట్ చేయడం జరిగిందట. వినడానికి విడ్డూరంగా ఉన్నా.. ఇది నిజం.