Agent OTT: ఏజెంట్ మూవీ ఓటీటీ రిలీజ్ వాయిదా వెనుక ఇంత జరిగిందా?

  • May 20, 2023 / 11:33 AM IST

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ మూవీ థియేటర్లలో డిజాస్టర్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే. ఈ మూవీ నిర్మాతలు సైతం ఈ సినిమా ఫ్లాప్ అని ఒప్పుకున్నారు. అఖిల్ ఈ సినిమా రిజల్ట్ కు సంబంధించి ఒక లెటర్ రాయగా ఆ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. సినిమాకు టాక్ మరీ దారుణంగా ఉండటంతో చాలామంది ప్రేక్షకులు ఈ సినిమాను థియేటర్లలో చూడటానికి ఆసక్తి చూపించలేదు.

అయితే సోనీ లివ్ లో ఈ నెల 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కావాల్సిన ఏజెంట్ మూవీ ఆ తేదీన ఓటీటీలో అందుబాటులోకి రాకపోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఈ సినిమా ఎందుకు ఓటీటీలో స్ట్రీమింగ్ కాలేదనే ప్రశ్నకు వేర్వేరు సమాధానాలు వినిపించాయి. అయితే సోనీ లివ్ ఓటీటీ ఎట్టకేలకు స్పందించి వైరల్ అవుతున్న కామెంట్లకు చెక్ పెట్టింది. అయితే ఏజెంట్ ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అవుతుందనే ప్రశ్నకు సోనీ లివ్ నిర్వాహకుల దగ్గర కూడా సమాధానం లేదు.

ప్రస్తుతం ఏజెంట్ మూవీ తమ దగ్గర అందుబాటులో లేదని ఎప్పటికప్పుడు తాజా అప్ డేట్ల కొరకు దయచేసి మా సోషల్ మీడియా వేదికలను అనుసరించాలని సోనీ లివ్ నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సమాధానం ఇచ్చిన కొంత సమయం తర్వాత ఏజెంట్ మూవీ త్వరలోనే సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని ఆ సంస్థ నిర్వాహకులు చెప్పుకొచ్చారు. మే 26వ తేదీన ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని ప్రచారం జరుగుతోంది.

ఏజెంట్ (Agent) మూవీ స్ట్రీమింగ్ సందేహాలకు సంబంధించి సమాధానం దొరకాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే. థియేటర్లలో ఫ్లాప్ గా నిలిచిన ఈ సినిమా ఓటీటీలో ఏ రేంజ్ హిట్ గా నిలుస్తుందో చూడాల్సి ఉంది. ఏజెంట్ ఓటీటీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఏజెంట్ సినిమా నిర్మాతలకు మాత్రం భారీ నష్టాలను మిగిల్చింది.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus