Prabhas, Surender Reddy: ప్రభాస్ సురేందర్ రెడ్డి కాంబో వెనుక ఇంత కథ జరిగిందా?

  • May 3, 2023 / 05:04 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ డైరెక్టర్లలో సురేందర్ రెడ్డి ఒకరు కాగా ఆయన డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి. అయితే ప్రభాస్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో మాత్రం సినిమా రాలేదనే సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ తో ఒక సినిమా సెట్ అయిందని ఒక స్టార్ హీరో మేనేజర్ వల్ల ఆ సినిమా చేయలేకపోయానని సురేందర్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. కెరీర్ స్టార్టింగ్ లోనే నాకు ప్రభాస్ తో అవకాశం వచ్చిందని.

ఆ మూవీకి ప్రొడ్యూసర్ కూడా సెట్ అయ్యారని అయితే స్టార్ హీరో మేనేజర్ ఒకరు రిక్వెస్ట్ చేయడంతో ఆ ప్రాజెక్ట్ విషయంలో వెనక్కు తగ్గాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. సురేందర్ రెడ్డి తర్వాత సినిమా బన్నీ హీరోగా తెరకెక్కుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. సురేందర్ రెడ్డి స్టార్ హీరోలతో సినిమా తీసి బ్లాక్ బస్టర్ సాధిస్తే మళ్లీ ప్రభాస్ (Prabhas) సినిమాకు పని చేసే ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది.

సురేందర్ రెడ్డి రైటర్ కాకపోవడం ఆయనకు సమస్య అయిందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సురేందర్ రెడ్డి ఇతర రచయితల కథలపై ఆధారపడటం వల్ల ఆయనకు ఫ్లాప్స్ వస్తున్నాయని కొంతమంది చెబుతున్నారు. సురేందర్ రెడ్డి రెమ్యునరేషన్ పరిమితంగానే ఉందని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో సురేందర్ రెడ్డి సినిమాలు ఆశించిన ఫలితాన్ని అందుకోవడం లేదు.

సురేందర్ రెడ్డి ఇకపై కెరీర్ విషయంలో మరింత జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంది. సురేందర్ రెడ్డి అతి త్వరలో కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. సురేందర్ రెడ్డికి బన్నీ నిజంగా ఛాన్స్ ఇస్తే మాత్రం రేసుగుర్రం సినిమాను మించిన మూవీ తీసి హిట్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సురేందర్ రెడ్డి మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి రావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus