అలాంటి కథను ఎంచుకుంటే మాత్రం సక్సెస్ దక్కినట్టేనా?

టాలీవుడ్ ప్రేక్షకులు మారుతున్న కాలానికి అనుగుణంగా సినిమాలను చూసే విషయంలో అభిప్రాయాలను మార్చుకుంటున్నారు. కొన్నేళ్ల క్రితం వరకు హర్రర్ కామెడీ సినిమాలకు బ్రహ్మరథం పట్టిన ప్రేక్షకులు ప్రస్తుతం హర్రర్ బ్యాక్ డ్రాప్ సినిమాలకు ఎక్కువగా ఆదరణ దక్కుతోంది. గతేడాది కాంతార, విక్రాంత్ రోణ సినిమాలు కొన్ని నెలల గ్యాప్ లోనే థియేటర్లలో విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ ఏడాది విడుదలైన విరూపాక్ష సినిమా కూడా ప్రేక్షకులకు ఎంతగానో నచ్చిందనే సంగతి తెలిసిందే.

హర్రర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన విరూపాక్ష సినిమా ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. ఈ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. యంగ్ డైరెక్టర్లు హర్రర్ సినిమాలను ఎంచుకుంటే వాళ్లకు కూడా సక్సెస్ దక్కే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. యంగ్ డైరెక్టర్లు ఈ తరహా కథలను ఎంచుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. విరూపాక్ష సినిమాకు ఫుల్ రన్ లో 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉంది.

ఈ సినిమాలో నటించిన నటీనటులందరి నటనకు మంచి మార్కులు పడ్డాయి. సాయితేజ్ ప్రస్తుతం రెండు క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తుండగా వినోదాయ సిత్తం రీమేక్ ఈ ఏడాదే థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది. విరూపాక్ష2 సినిమాకు సంబంధించి షాకింగ్ అప్ డేట్స్ వస్తుండగా ఈ సినిమా మరింత స్పెషల్ గా ఉండనుందని తెలుస్తోంది. విరూపాక్ష2 కూడా వచ్చే ఏడాది విడుదలై సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

విరూపాక్ష (Virupaksha) విజయంతో సాయితేజ్ రెమ్యునరేషన్ ను పెంచేశాడని తెలుస్తోంది. సాయితేజ్ కు రాబోయే రోజుల్లో మరిన్ని భారీ విజయాలు అయితే సొంతం కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సాయితేజ్ కథ నచ్చితే మల్టీస్టారర్ సినిమాలకు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus