Pawan Kalyan, Sujeeth: సుజీత్ ప్రాజెక్ట్ అలా సెట్ అయిందన్నమాట!

  • December 5, 2022 / 01:21 PM IST

మొత్తానికి పవన్ కళ్యాణ్, సుజీత్ కాంబినేషన్ లో సినిమా సెట్ అయినట్లు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చేసింది. అది కూడా ‘ఆర్ఆర్ఆర్’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తీసిన డీవీవీ దానయ్య బ్యానర్ లో కావడం ఫ్యాన్స్ కి మరింత ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ మధ్యకాలంలో సుజీత్.. పవన్ కళ్యాణ్ ని తరచూ కలుస్తుండడంతో వీరి కాంబోలో సినిమా ఖాయమని అంతా అనుకున్నారు. అదే నిజమైంది. పవన్ లుక్ రిలీజ్ చేయకపోయినా..

వెనుక నుంచి అతని ఇమేజ్ మీద జపాన్ భాషలో ‘అగ్గి తుఫాను వస్తోంది’ అని అర్ధం వచ్చేలా క్యాప్షన్ పెట్టడం వైరల్ అవుతోంది. ‘They call him OG’ అనే లైన్ కూడా జోడించారు. అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అని మీనింగ్. ఈ సినిమాకి రవి కె చంద్రన్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేయనున్నారు. ఇదిలా ఉండగా.. ఈ ప్రాజెక్ట్ సెట్ అవ్వడానికి ముందు చాలా పెద్ద కథే నడిచిందట. కొంతకాలం క్రితం డీవీవీ దానయ్య చిరంజీవితో వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా అనౌన్స్ చేశారు.

కానీ అది ముందుకు కదల్లేదు. ఫైనల్ వెర్షన్ సంతృప్తికరంగా రాకపోవడంతో డ్రాప్ అయ్యారనే మాటలు వినిపించాయి. ఆ తరువాత ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి ఊసు లేదు. దాని స్థానంలోనే ఇప్పుడు దానయ్యకు ఈ కాంబో సెట్ చేశారని టాక్. అంతేకాదు.. ‘లూసిఫర్’ రీమేక్ కు ముందు సుజీత్ ను తీసుకొని ఆ తరువాత వద్దనుకున్నారు. ఆ సమయంలో ఓ మెగా మూవీ ఇస్తామనే హామీ ఇచ్చారట.

ఆ కమిట్మెంట్ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ ద్వారాగా నెరవేర్చారని టాక్. ఆ విధంగా సుజీత్ కు, డీవీవీ దానయ్యకు న్యాయం చేశారన్నమాట. ఇక ఈ ప్రాజెక్ట్ విషయానికొస్తే.. పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తారని టాక్. అప్పుడెప్పుడో ‘పంజా’, ‘బాలు’ సినిమాల్లో ఈ తరహా పాత్రలు పోషించారు పవన్. మళ్లీ ఇంతకాలానికి పవన్ ని మరో పవర్ ఫుల్ రోల్ లో చూడబోతున్నాం!

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus