పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజీత్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుందని నిన్నటినుంచి సోషల్ మీడియా, వెబ్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. దానయ్య, త్రివిక్రమ్ నిర్మాతలుగా సుజీత్ డైరెక్షన్ లో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనుందని తెరి సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కనుందని వైరల్ అయిన వార్తల సారాంశం. అయితే వైరల్ అవుతున్న వార్తలకు సంబంధించి దానయ్య సొంత సంస్థ అయిన డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నుంచి స్పష్టత వచ్చింది.
తమ సంస్థ నుంచి ఏదైనా మూవీ ఓకే అయిందంటే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తామని తమ సంస్థ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి వైరల్ అవుతున్న వార్తలను నమ్మవద్దని ట్వీట్ లో వెల్లడించారు. పవన్ సుజీత్ కాంబో మూవీ గురించి ఈ సంస్థ ఈ విధంగా స్పష్టత ఇచ్చింది. సుజీత్ స్పందిస్తే మాత్రమే పవన్ హీరోగా మరో నిర్మాతతో ఈ ప్రాజెక్ట్ ఉందో లేదో పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రాజెక్ట్ ల షూటింగ్ లు పూర్తి కావడానికి మరో రెండేళ్ల సమయం పట్టే అవకాశం అయితే ఉంది. మరోవైపు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ కావాలని అనుకుంటున్నారు. అందువల్ల పవన్ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి వైరల్ అవుతున్న వార్తలకు సంబంధించి అధికారక ప్రకటన వస్తే మాత్రమే నమ్మాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 60 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు.
రీఎంట్రీలో పవన్ కళ్యాణ్ రీమేక్ సినిమాలకు ఎక్కువగా గ్రీన్ సిగ్నల్ ఇస్తుండటం గమనార్హం. పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది. పవన్ హీరోగా తెరకెక్కాల్సిన వినోదాయ సిత్తం రీమేక్, భవదీయుడు భగత్ సింగ్ సినిమాల షూటింగ్ కు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. ఈ సినిమాలతో పవన్ విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Most Recommended Video
‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర