Thaman: సోషల్ మీడియాకి దూరం కానున్న తమన్.. కారణం ఆ హీరోనా?

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఇప్పుడు తమన్ టాప్ ప్లేస్ లో ఉన్నాడు. పెద్ద సినిమాలు అన్నీ తమన్ అకౌంట్లోనే ఉన్నాయి. ఇన్ని పెద్ద సినిమాలను తమన్ ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు? చార్ట్ బస్టర్స్ సాంగ్స్ ను ఎలా ఇవ్వగలుగుతున్నాడు? అనే డౌట్ అందరిలోనూ ఉంది. ఇందుకు నెటిజన్లు.. ‘కొన్ని హాలీవుడ్ ఆల్బమ్స్ నుండి తమన్ కాపీ కొట్టేస్తున్నాడు. అలాగే తెలుగులో గతంలో వచ్చిన ప్లాప్ సినిమాల ట్యూన్స్ ను మళ్ళీ కొంచెం మార్చి వాడేస్తున్నాడు’ అని చెబుతూ ఉంటారు.

వీటికి తమన్ .. ‘నేను అలా వాడేస్తే దర్శకులు ఏమైనా పిచ్చోళ్లా.. సెలక్ట్ చేసుకోవడానికి?’ అంటూ చెబుతుంటాడు. తమన్ సంగీతం అందించే సినిమాల ప్రోమోలు, మోషన్ పోస్టర్లు వస్తే చాలు.. నెటిజన్లు అలెర్ట్ అయిపోయి.. తమన్ మళ్ళీ ఆ మ్యూజిక్ లేపేశాడు అంటుంటారు. వాటికి సోషల్ మీడియాలో గట్టిగానే బదులిస్తూ ఉంటాడు తమన్. మరోపక్క అతను స్టార్ హీరోల సినిమాలకి పనిచేస్తున్నట్టయితే కనుక హడావిడి మామూలుగా ఉండదు.

ముఖ్యంగా సోషల్ మీడియాలో తమన్ (Thaman) ఓ రేంజ్లో హడావిడి చేస్తుంటాడు. ‘ప్రతి స్టార్ హీరోకి నేను అభిమానిని అని, కీబోర్డులు ఇరక్కొట్టేశాను, డ్రమ్స్ ఇరక్కొట్టేశాను’ అంటూ తమన్ చేసే కామెంట్స్ పై ట్రోలింగ్ కూడా గట్టిగానే జరుగుతుంది. అన్నీ ఎలా ఉన్నా.. ప్రస్తుతం అతను మహేష్ – త్రివిక్రమ్ ల ‘గుంటూరు కారం’ సినిమాకి పనిచేస్తున్నాడు. ఇతను సోషల్ మీడియా పై ఎక్కువ ఫోకస్ పెట్టడం మహేష్ కి నచ్చడం లేదట.

దీంతో అతన్ని మార్చేద్దాం అని త్రివిక్రమ్ కి చెప్పాడట. అయితే ఈ చిత్రం కోసం తమన్ ఆల్రెడీ 40 శాతం వర్క్ కంప్లీట్ చేసినట్టు వినికిడి. ఈ టైంలో మార్చడానికి కుదరదు కాబట్టి..అతను పనిచేసే విధానం మార్చుకోవాలని తమన్ కు త్రివిక్రమ్ సూచించినట్టు తెలుస్తుంది. అందుకే తమన్ ఇప్పుడు సోషల్ మీడియాలో సైలెంట్ అయిపోయాడు. ఎక్కువగా పోస్టులు చేయడం లేదు.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus