Trivikram: 20 ఏళ్ళుగా ఓ ఇంటికి అద్దె చెల్లిస్తున్న త్రివిక్రమ్.. కారణం అదేనట..!

  • September 2, 2021 / 05:06 PM IST

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్టార్ ఇమేజ్ గురించి అతని ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మాటల్లో వర్ణించలేము. రాజమౌళి తర్వాత ఆ స్థాయిలో టాలీవుడ్లో రాణిస్తున్న దర్శకుడు త్రివిక్రమ్ అనడంలో సందేహం లేదు.తీసిన కథతోనే మళ్ళీ సినిమా చేసినా.. ఆల్ టైం హిట్లు కొడుతుంటాడు త్రివిక్రమ్.ఇతని డైరెక్షన్లో సినిమా చేయాలని ఆశపడని హీరో ఉండడు అంటే అతిశయోక్తి కాదేమో.ఇక ఇతని స్పీచ్ లకు ఉండే డిమాండ్ కూడా అంతా ఇంతా కాదు. ఇండస్ట్రీలో పెద్ద పెద్ద నిర్మాతలు ఏరి కోరి తమ సినిమా వేడుకలకి త్రివిక్రమ్ ను ఆహ్వానిస్తూ ఉంటారు.

ఆ సినిమా వేడుకల్లో త్రివిక్రమ్ పలికే ఒక్కో మాట ఒక్కో కోటి అన్నట్టు వారు భవిస్తూ ఉంటారు. ఇంత డిమాండ్ ఉన్న త్రివిక్రమ్.. ఒకప్పుడు చాలా సాదా సీదా మనిషి అన్న సంగతి బహుశా ఎక్కువ మందికి తెలిసుండదు. తన దగ్గర రూ.60లు ఉంటే.. వారమంతా సరిపెట్టుకునే వాడట త్రివిక్రమ్. కమెడియన్ సునీల్ ఇతనికి బెస్ట్ ఫ్రెండ్. గతంలో వీళ్ళు ఒకే రూంలో ఉండేవారు. అది హైదరాబాద్లోని పంజాగుట్టలో ఉందట. అందరికీ సినిమాల్లో మంచి అవకాశాలు వచ్చినప్పుడు ఆ రూమ్ ను ఖాళీ చేసేసారు. ప్రస్తుతం ఆ రూంలో ఎవ్వరూ ఉండడం లేదు.

దీంతో ఎంత మంది ఆ రూమ్ ను రెంట్ కు ఇవ్వమని అడిగినా ఆ ఇంటి ఓనర్ ఇవ్వడం లేదట. దానికి ముఖ్య కారణం త్రివిక్రమ్ ఇంకా ఆ రూమ్ కు అద్దె చెల్లించడం వలనే అని తెలుస్తుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 ఏళ్ళ నుండీ ఆ రూమ్ కు అద్దె చెల్లిస్తున్నాడట త్రివిక్రమ్. ఇప్పటికీ అతను కథలు రాసుకోవడానికి ఆ రూమ్ కు వెళ్తుంటాడాన్ని కూడా తెలుస్తుంది. అంటే అది తన లక్కీ రూమ్ గా త్రివిక్రమ్ భావిస్తున్నాడన్న మాట.

1

2

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus