దివంగత స్టార్ హీరో నందమూరి తారకరామారావు హీరోగా అతిలోక సుందరి శ్రీదేవి హీరోయిన్ గా ఎన్నో సినిమాలు వచ్చాయి. వీటిలో సూపర్ హిట్ సినిమాలు చాలా ఉన్నాయి. అయితే శ్రీదేవి బాలనటిగా రామారావుగారి సినిమాలో.. అది కూడా మనవరాలి పాత్రలో చేసినప్పటికీ తరువాత ఆయనకు జోడీగా నటించింది. అయితే ఆయన కొడుకు నందమూరి బాలకృష్ణకు జోడీగా శ్రీదేవి ఒక్క సినిమాలో కూడా నటించలేదు. ఆల్రెడీ తండ్రి పక్కన నటించిన తరువాత కొడుకుకి జోడీగా నటించడమేంటి అంటారా? అలా అనుకుంటే.. అక్కినేని నాగేశ్వరరావు గారి సరసన నటించిన శ్రీదేవి..
తరువాత మన కింగ్ నాగార్జున సరసన కూడా నటించింది కదా అనేవాళ్ళు కూడా ఉన్నారు.సినిమాల పరంగా అలాంటి కాల్యుక్యులేషన్స్ ఉండవు. అందులోనూ బాలయ్య కంటే శ్రీదేవి వయసులో చిన్నావిడే..! ‘రౌడీ రాముడు- కొంటె కృష్ణుడు’ ‘అనురాగ దేవత’ వంటి సినిమాల్లో బాలకృష్ణ, శ్రీదేవి కలిసి నటించారు కానీ జంట గా మాత్రం కాదు. నిజానికి వీరి కాంబినేషన్లో సినిమా రావాల్సిందేనట. 1987 లో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు గారు వీరిద్దరి కాంబినేషన్ లో ‘సామ్రాట్’ అనే చిత్రాన్ని అనౌన్స్ చేశారు.
కానీ ఎందుకో అది కార్యరూపం దాల్చలేదు. ఆ తరువాత 1989 లో కోదండరామిరెడ్డి డైరెక్షన్లో వచ్చిన ‘భలేదొంగ’ సినిమా లో కూడా మొదట బాలయ్య సరసన శ్రీదేవి నే హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఆ టైములో శ్రీదేవి హిందీ సినిమాలతో బిజీగా ఉండడం వలన బాలకృష్ణకు జోడీగా నటించలేకపోయారట.
Most Recommended Video
30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!