Prashanth Neel, Rajamouli: స్టార్ డైరెక్టర్లు ఈ విషయాలను గుర్తు పెట్టుకుంటారా?

భారీ అంచనాలతో విడుదలైన కేజీఎఫ్ ఛాప్టర్2 సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. సినిమాలో ప్రేక్షకులకు నచ్చే గూస్ బంప్స్ మూవ్ మెంట్స్ ఎక్కువగానే ఉన్నాయని తెలుస్తోంది. భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కించడంతో పాటు ఆ సినిమాలతో మరపురాని విజయాలను అందుకుంటూ జక్కన్న, ప్రశాంత్ నీల్ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ ఇద్దరు స్టార్ డైరెక్టర్లు తమ ప్రతిభతో సౌత్ సినిమాల ఖ్యాతిని మరింత పెంచుతున్నారు. ఈ మధ్య కాలంలో చాలామంది డైరెక్టర్లు భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

Click Here To Watch NOW

అయితే రాజమౌళి, ప్రశాంత్ నీల్ సక్సెస్ సాధించిన స్థాయిలో మరే డైరెక్టర్ సక్సెస్ సాధించలేదు. చాలామంది డైరెక్టర్లు పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కిస్తున్నామని చెప్పి భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కిస్తున్నా ఈ డైరెక్టర్లు కథ, కథనానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఒకటి రెండు కళ్లు చెదిరే గ్రాఫిక్స్ సీన్లను తెరకెక్కిస్తూ ప్రేక్షకుల సహనాన్ని దర్శకులు పరీక్షిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాలకు నెగిటివ్ వస్తే ఆ సినిమాలను నిర్మించిన నిర్మాత ఆర్థికంగా కోలుకోవడం కష్టమని చెప్పవచ్చు.

కథ, కథనానికి అనుగుణంగా బడ్జెట్ కేటాయించి సినిమాలను నిర్మిస్తే మాత్రమే సినిమాలకు బెనిఫిట్ కలుగుతుందని చెప్పవచ్చు. పస లేని కథలతో తెరకెక్కే సినిమాలపై కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఆ డబ్బు బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. మరి కొందరు యంగ్ డైరెక్టర్లు చిన్న హీరోలతో, మిడిల్ రేంజ్ హీరోలతో విజయవంతమైన సినిమాలను నిర్మిస్తూ పెద్ద హీరోలతో హిట్ సినిమాను తెరకెక్కించడంలో ఫెయిల్ అవుతున్నారు.

తాజాగా విడుదలైన బీస్ట్ సినిమా విషయంలో ఇదే విధంగా జరిగింది. పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కించే దర్శకులు ఈ విషయాలను గుర్తు పెట్టుకుంటే మంచిది. డైరెక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం ఆయా డైరెక్టర్ల కెరీర్ కే ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus