The Warriorr Movie: ది వారియర్ గురించి సెన్సార్ సభ్యులు అలా అన్నారా?

టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ త్వరలోనే దివారియర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ఈనెల 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విడుదల తేదీ దగ్గర పడటంతో చిత్ర బృందం పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో ఫ్రీ రిలీజ్ వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంది. తన కెరీయర్ లో మొదటిసారిగా ద్విభాషా చిత్రంలో నటిస్తున్నారు.

లింగుస్వామి దర్శకత్వంలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇక ఈ సినిమాలో రామ్ సరసన కృతీశెట్టి సందడి చేయనుంది. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తూ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఇకపోతే తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాని చూసిన సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు ఏకంగా U/A సర్టిఫికెట్ జారీ చేశారు.

అదేవిధంగా సినిమా రన్ టైం కూడా ప్రకటించారు. ఈ సినిమా 2 గంటల 35 నిమిషాల రన్ టైం ప్రకటించారు. ఇక ఇదే విషయాన్ని చిత్ర బృందం తెలియజేస్తూ పోస్టర్ విడుదల చేశారు. ఇక ఈ సినిమాలో రామ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో సందడి చేయగా కృతి శెట్టి రేడియో జాకీగా సందడి చేయనున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.

ముఖ్యంగా బుల్లెట్ సాంగ్, విజిల్ పాటలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ సరికొత్త రికార్డును సృష్టించాయి. ఇలా తెలుగు తమిళ భాషలలో ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా 14వ తేదీ విడుదలవుతోంది. మరి ఈ సినిమా ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో తెలియాల్సి ఉంది.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus