Krish4 Movie: క్రిష్4 సినిమా ప్రత్యేకతలు తెలిస్తే షాకవ్వాల్సిందే?

  • August 19, 2022 / 11:28 AM IST

హృతిక్ రోషన్ కు స్టార్ హీరోగా ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు దక్కడానికి కోయి మిల్ గయా, క్రిష్, క్రిష్3 సినిమాలు కారణమనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి సక్సెస్ ను సొంతం చేసుకున్నాయి. బాలీవుడ్ డైరెక్టర్ రాకేశ్ రోషన్ కోయి మిల్ గయా సినిమాలో జాదు పాత్రను పరిచయం చేసి ఆ సినిమాతో భారీ సక్సెస్ ను సొంతం చేసుకున్నారు. జాదు ఇచ్చిన శక్తులతో సూపర్ హీరోగా హృతిక్ రోషన్ విన్యాసాలు చేసిన క్రిష్ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చింది.

చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు క్రిష్ సినిమాలోని అద్భుతమైన కథ, కథనానికి ఫిదా అయ్యారు. ఈ సినిమాకు కొనసాగింపుగా తెరకెక్కి 2013లో విడుదలైన క్రిష్3 కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. క్రిటిక్స్ నుంచి నెగిటివ్ రివ్యూలు వచ్చినా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. హనీ ఇరానీ ప్రస్తుతం క్రిష్4 కథ సిద్ధం చేస్తున్నారని సమాచారం అందుతోంది. క్రిష్3 ఎక్కడైతే ముగిసిందో క్రిష్4 అక్కడే మొదలవుతుందని తెలుస్తోంది. సూపర్ హీరో సైన్స్ ఫిక్షన్ లా ఈ సినిమా ఉంటుందని ఊహలకు అందని సన్నివేశాలతో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం అందుతోంది.

ప్రస్తుతం హృతిక్ రోషన్ పలు సినిమాలలో నటిస్తున్నారు. ఈ సినిమాలు పూర్తైతే క్రిష్4 మూవీ షూటింగ్ మొదలయ్యే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది. క్రిష్4 మూవీ రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. క్రిష్4 సినిమాతో హృతిక్ రోషన్ ఖాతాలో మరో సక్సెస్ చేరనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

హృతిక్ ప్రాజెక్ట్ ల ఎంపికలో జాగ్రత్త వహించాలని అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. హృతిక్ రోషన్ రెమ్యునరేషన్ సైతం గత కొన్నేళ్లలో ఊహించని స్థాయిలో పెరిగిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సినిమాసినిమాకు హృతిక్ కు క్రేజ్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus