‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్ల లిస్టు అంతా ఫేకేనా….?

Advertisement

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా జూన్ లో మొదలు కావాల్సిన ‘బిగ్ బాస్4’ చాలా లేట్ గా మొదలవుతుంది. ప్రస్తుతం ప్రోమోలతో సందడి మొదలుపెట్టారు హోస్ట్ నాగార్జున.ఆగష్టు 30న ‘బిగ్ బాస్4’ మొదలవుతుంది అంటూ వార్తలు వచ్చాయి కానీ… సెట్ నిర్మాణం పూర్తి కాకపోవడం అందులోనూ కంటెస్టెంట్ల ప్రక్రియ ఇంకా పూర్తికాకపోవడం వల్ల లేట్ అవుతుందని వినికిడి.ఈసారి మాత్రం ‘బిగ్ బాస్4’ ను 50 రోజులు లేదా 75 రోజులు మాత్రమే నిర్వహించబోతున్నారని కూడా టాక్ నడుస్తుంది.

ఇదిలా ఉండగా.. ఇప్పటికే ‘బిగ్ బాస్ 4’ కంటెస్టెంట్లు ఫైనల్ అయినట్టు ప్రచారం జరుగుతుంది. కానీ అందుతున్న సమాచారం ప్రకారం ఆ లిస్టు అంతా ఫేక్ అని తెలుస్తుంది. ‘బిగ్ బాస్4’ నిర్వాహకులు అనుకున్న లిస్టు ప్రకారం 25 మంది సెలబ్రిటీలు అయ్యరట. వీరిలో ఎంత మంది ఫైనల్ అవుతారు అనేది మాత్రం డౌట్ అని సమాచారం. యాంకర్ లాస్య, సింగర్ నోయల్, గంగవ్వ, నందు వంటి వారు మాత్రమే ఫైనల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉందట.

ఇక హౌస్మేట్స్ అందరినీ షో మొదలయ్యే రెండు వారాల ముందు వరకూ క్వారంటైన్ లో పెట్టబోతున్నారని కూడా సమాచారం. ఇక హోస్ట్ నాగార్జున మేకప్ రూమ్ ను కూడా నాలుగైదు సార్లు శానిటైజ్ చెయ్యాలనే ఆదేశాలు కూడా యూనిట్ సభ్యులకు వెళ్లినట్టు కూడా తెలుస్తుంది.

Most Recommended Video

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
IMDB రేటింగ్స్ ప్రకారం టాప్ 25 టాలీవుడ్ మూవీస్ ఇవే…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus