ఉప్పెన సినిమాలో హైలెట్ సీన్స్ ఇవేనా..?

  • January 27, 2021 / 09:31 PM IST

ప్రేమికులరోజులకి రెండురోజుల ముందే తెలుగు సినిమా థియేటర్స్ లో ఇద్దరూ ప్రేమికులు సందడి చేయబోతున్నారు. ఫిబ్రవరి 12వ తేదిన రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా గ్రాండ్ గా ఉప్పెన సినిమా రిలీజ్ అవ్వబోతోంది. మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీగా ఇది రాబోతున్న సంగతి తెలిసిందే. కృతిశెట్టి స్పెషల్ ఎట్రాక్షన్ గా, విజయ్ సేతుపతి యాక్షన్ ఫేమ్ తో, వైష్ణవ్ తేజ్ మాస్ లుక్ తో రాబోతున్న ఈసినిమా ఇప్పుడు సినీలవర్స్ లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అసలు ఈ ఉప్పెన ఎలా ఉండబోతోంది ? సినిమాలో హైలెట్స్ ఏంటి అనేది మనం చూసినట్లయితే..,

ఫీల్ గుడ్ మూవీగా డైరెక్టర్ బుచ్చిబాబు ఈసినిమాని చాలా అందంగా మలిచారు. అందమైన లొకేషన్స్ తో ఫ్రెష్ లవ్ సీన్స్ తో సినిమా సాగిపోతుందని మూవీ టీమ్ చెప్తోంది. అంతేకాదు, దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన సాంగ్స్ ఇప్పటికే యూత్ లో మంచి క్రేజ్ ని తెచ్చుకోవడం సినిమాకి ప్లస్ పాయింట్. వైష్ణవ్ తేజ్ యాక్టింగ్, కృతి శెట్టి అందాలు సినిమాని వేరే లెవల్లో ప్రజెంట్ చేయడానికి సిద్ధమయ్యాయి. బుచ్చిబాబు ఎంచుకున్న కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుందని, క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలు, అలాగే హీరో హీరోయిన్స్ మద్యన వచ్చే లవ్ సీన్స్ చాలా బాగుంటాయని చెప్తున్నారు.

సుకుమార్ దగ్గర వర్క్ చేసిన బుచ్చిబాబు చాలాకాలంగా రాసుకున్న అందమైన ప్రేమకథ ఇది అని, అందుకే చిత్రయూనిట్ ఎంతో కాన్ఫిడెంట్ గా ఉందని అంటున్నారు. ఓటీటీల్లో భారీ ఆఫర్ వచ్చినా కూడా రిలీజ్ చేయకుండా, కేవలం థియేటర్స్ లో రిలీజ్ చేయడం కోసమే ఇంతకాలం వెయిట్ చేశారని డైరెక్టర్స్ టీమ్ చెప్తోంది. బుచ్చిబాబు సినిమా గురించి మాట్లాడుతూ ఇది ఒక అందమైన ప్రేమకథ అని, చూస్తున్నవాళ్లంతా హీరో హీరోయిన్ల మద్యన వచ్చే ప్రేమకి ఫిదా అయిపోతారని ఈ సీన్స్ సినిమాకే హైలెట్ గా ఉంటాయని చెప్తున్నారు. అతి త్వరలోనే సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నామని చెప్పారు. ఇక మెగా ఫ్యామిలీ నుంచి పరిచయం అవుతున్న వైష్ణవ్ తేజ్ కి ఈ సినిమా హిట్ ఇస్తుందా లేదా అనేది చూడాలి.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
సౌత్ లో సక్సెస్ అయిన టాక్ షోలు.. ఏ తారలు హోస్ట్ చేసినవంటే..!
వరల్డ్ రికార్డ్ కొట్టి.. టాలీవుడ్ స్థాయిని పెంచిన సెలబ్రిటీల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus