క‌‌ల‌ర్ ఫొటో చిత్ర‌ ఆల్బ‌మ్ నుంచి థ‌ర్డ్ సింగిల్ “ఏకాంతం” విడుద‌ల‌

అమృత ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్ పై శ్ర‌వ‌ణ్ కొంక‌, లౌక్య ఎంట‌ర్ టైన్మెంట్స్ స‌మ‌ర్ప‌ణ‌లో సాయి రాజేష్ నీలం, బెన్నీ ముప్పానేని నిర్మాత‌లుగా సందీప్ రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం క‌ల‌ర్ ఫొటో. ఈ సినిమాతో సందీప్ ద‌ర్శ‌కుడిగా తెలుగు చిత్ర సీమ‌కు ప‌రిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో సుహాస్, చాందీని చౌద‌రి జంట‌గా న‌టిస్తున్నారు. ప్ర‌ముఖ న‌టుడు సునీల్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. వైవా హ‌ర్ష మ‌రో కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. అమృత ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్ ద్వారా హృద‌య‌కాలేయం, కొబ్బ‌రి మ‌ట్ట వంటి సూప‌ర్ హిట్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్స్ ని అందించిన నిర్మాత సాయి రాజేశ్, ఇప్పుడు క‌ల‌ర్ ఫొటో చిత్రానికి క‌థ కూడా అందించ‌డం విశేషం.

ఇటీవ‌లే క‌ల‌ర్ ఫొటో టీమ్ విడుద‌ల చేసిన టీజ‌ర్ కు, అలానే చిత్ర ఆడియో ఆల్బ‌మ్ నుంచి విడుద‌లైన మొద‌టి రెండు పాట‌ల‌కి ఆన్ లైన్ తో పాటు వివిధ వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుంచి అనూహ్య స్పంద‌న ల‌భించింది. ఈ నేప‌థ్యంలో ఏకాంతం అంటూ మొద‌లైయ్యే ఓ ఎమోష‌న‌ల్ సాంగ్ ని చిత్ర బృందం తాజాగా విడుద‌ల చేసింది. ఈ చిత్రానికి కాల‌భైర‌వ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్ర‌ముఖ మ్యూజిక్ కంపెని, ఆదిత్య మ్యూజిక్ వారు ఈ చిత్ర ఆడియోని విడుద‌ల చేస్తున్నారు.


చిన్నపిల్లలుగా మారిపోయిన ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్స్.. ఎలా ఉన్నారో మీరే చూడండి..!
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus