Thiru Trailer: ఆకట్టుకుంటున్న ధనుష్ తిరు ట్రైలర్.. వైరల్ వీడియో!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తన భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత పూర్తి దృష్టిని తన సినిమాలపై పెట్టారు. ఈ క్రమంలోనే ఈయన ప్రస్తుతం కోలీవుడ్ సినిమాలతో పాటు హాలీవుడ్, టాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇన్ని రోజులపాటు హాలీవుడ్ చిత్రం గ్రేమ్యాన్ సినిమాతో ఎంతో బిజీగా గడిపిన ధనుష్ తాజాగా మరొక కోలీవుడ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. మిత్రన్ ఆర్. జవహర్ దర్శకత్వంలో తెరకెక్కిన తిరు చిత్రాంబళం సినిమాను తెలుగులో తిరు పేరుతో రిలీజ్ చేస్తున్నారు.

ఈ చిత్రంలో ధనుష్ సరసన నిత్యా మీనన్, ప్రియా భవాని శంకర్, రాశీ ఖన్నా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ టీజర్ పెద్ద ఎత్తున సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సినిమా తెలుగు ట్రైలర్ లాంచ్ చేయడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో ధనుష్ డెలివరీ బాయ్ పాత్రలో సందడి చేయనున్నారు.

రోజు మొత్తం ఫుడ్ డెలివరీలు చేస్తూ సాయంత్రం అయ్యేసరికి తన తాతయ్యతో కలిసి మందు కొడుతూ తన జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు.ఇకపోతే ఈ సినిమాలో నిత్యామీనన్ ధనుష్ చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్ పాత్రలో సందడి చేయనుంది. ఇక ఈ సినిమాలో రాశి కన్నా, ప్రియా భవాని శంకర్ హీరోయిన్లుగా కనిపించనున్నారు.ఇక వీరిద్దరిలో ఈయన ఎవరిని లవ్ చేశారు, ఎవరిని పెళ్లి చేసుకుంటారు అనే విషయాన్ని ఎంతో వినోదాత్మక భరితంగా చూపించారు.

ఇందులో ధనుష్ తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారు. ధనుష్ తాత పాత్రలో భారతీ రాజా సందడి చేశారు. మొత్తానికి ఈ ట్రైలర్ అందరికీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక అనిరుద్ సంగీతం ఎప్పటిలాగే సినిమాకి మరింత ప్లస్ కానుంది ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో ఆగస్టు 18వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!


తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus