Devil: డెవిల్ సినిమాకు కలెక్షన్లు తగ్గడానికి అసలు కారణాలు ఇవేనా?

  • January 1, 2024 / 03:39 PM IST

సాధారణంగా క్రేజ్ ఉన్న హీరోల సినిమాలకు టాక్ తో సంబంధం లేకుండా ఫస్ట్ డే కలెక్షన్లు వస్తున్నాయి. కళ్యాణ్ రామ్ గత సినిమాలైన బింబిసార, అమిగోస్ లకు మొదటిరోజున చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లు వచ్చాయనే సంగతి తెలిసిందే. అయితే డెవిల్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు మాత్రం ఆశించిన రేంజ్ లో లేవు. సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా శని, ఆదివారాలలో బుకింగ్స్ చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కినా ఈ సినిమా అంచనాలకు అందుకోవడంలో ఫెయిలైంది.

బాలయ్య ఫ్యాన్స్ సపోర్ట్ లేకపోవడం వల్లే డెవిల్ సినిమాకు ఆశించిన స్థాయిలో బుకింగ్స్ జరగలేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కొన్నిరోజుల క్రితం పాలిటిక్స్ కు సంబంధించి కళ్యాణ్ రామ్ చేసిన కామెంట్లు నెట్టింట హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. డెవిల్ సినిమా ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. డెవిల్ సినిమాకు సీక్వెల్ ఉంటుందని కళ్యాణ్ రామ్ చెప్పిన సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమాకు సీక్వెల్ రైట్ కాదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డెవిల్ సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయకపోవడం కూడా ఒకింత మైనస్ అయిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కళ్యాణ్ రామ్ క్రేజ్ ఉన్న డైరెక్టర్ల డైరెక్షన్ లో నటిస్తే అతని కెరీర్ మరింత పుంజుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. కళ్యాణ్ రామ్ తర్వాత ప్రాజెక్ట్ లపై అంచనాలు పెరుగుతున్నాయి.

కళ్యాణ్ రామ్ బింబిసార2 సినిమాను త్వరగా సెట్స్ పైకి తీసుకెళ్తే బాగుంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. సొంత బ్యానర్ లో తెరకెక్కిన సినిమాలు కళ్యాణ్ రామ్ కు మంచి పేరు తెచ్చిపెడుతున్నాయి. కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్ సినిమాలలో నటించాలని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కళ్యాణ్ రామ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.

డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

బబుల్ గమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ఖైదీ నెంబర్ 786’ టు ‘ఠాగూర్’.. తెలుగులో రీమేక్ అయిన విజయ్ కాంత్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus